YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫైర్ బ్రాండ్ ను ఎదుర్కొనేందుకు టీడీపీ ప్లాన్

ఫైర్ బ్రాండ్ ను ఎదుర్కొనేందుకు టీడీపీ ప్లాన్

వైసీపీ లేడీ ఫైర్‌ బ్రాండ్‌ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్‌కే. రోజాపై వచ్చే ఎన్నికల్లో సరైన ప్రత్యర్ధిని నిలబెట్టేందుకు చంద్రబాబు పెద్ద కసరత్తులే చేస్తున్నారు. అసలు నగరి టీడీపీ అంటేనే దివంగత నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడుకు మంచి పట్టున్న నియోజకవర్గం. గతంలో రద్దు అయిన పుత్తూరు నుంచి ఆ తర్వాత నగరి నుంచి విజయాలు సాధించిన గాలికి ఆ ప్రాంతమంతా పెట్టనికోట. పార్టీలు మారినా పుత్తూరు, నగరి ఇలా నియోజకవర్గాలు మారినా గాలి మాత్రం వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. ఎలా అయిన అసెంబ్లీకి వెళ్లాలన్న కోరికతో వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తూ… నియోజకవర్గాలు మారుతూ దండయాత్ర చేస్తున్న రోజా 2004లో నగరిలో 2009లో చంద్రగిరిలో వరుసగా ఓడిపోయారు.2009 ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీలోకి జంప్‌ చేసి గత ఎన్నికల్లో ఏకంగా గాలిపైనే సంచలన విజయం సాధించి తన ఫైర్‌ బ్రాండ్‌ ముద్ర సార్థకం చేసుకున్నారు. అయితే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆకస్మిక మృతితో నగరి టీడీపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముద్దు కృష్ణమ నాయుడు మృతి తర్వాత ఆయన వారసులు గాలి భానుప్రకాశ్‌ నాయుడు, గాలి జగదీశ్‌ ఇద్దరూ ఆయన మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంతో పాటు నగరి నియోజకవర్గ టీడీపీ పగ్గాలు కోసం ఒకరి మీద ఒకరు ఎత్తులు, పైఎతులు వేసుకున్నారు. చివరికి చంద్రబాబు వారిద్దరికీ సర్ది చెప్పలేక మధ్యే మార్గంగా గాలి భార్య సరస్వతమ్మకు ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవం చేశారు. వాస్తవంగా చూస్తే నియోజకవర్గంలో గాలి పెద్ద కుమారుడు భానుప్రకాశ్‌ నాయుడుకే మంచి పట్టుంది. తండ్రితో పాటు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.సోదరుల‌ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎమ్మెల్సీ స్థానాన్నే గాలి భార్యకు ఇచ్చిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ సీటును వీరిలో ఎవరికి ఇచ్చినా మరొకరు ఎంత వరకు సహకరిస్తారన్న దానిపై ఆయ‌న సందేహంతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నగరిలో కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తూ ఓ వ్యక్తి పేరుపై దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలోనూ బయట పదే పదే చంద్రబాబుతో పాటు టీడీపీని అసభ్య పదజాలంతో టార్గెట్‌ చేస్తున్న రోజాను ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలోకి ఎంట్రీ కాకుండా చూడాలని ప్రయత్నిస్తున్న టీడీపీ అధిష్టానం నగరిలో విద్యాసంస్థల అధిపతి అశోక్‌ రాజును రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. అశోక్‌ రాజుకు నగరి టీడీపీ సీటు ఇచ్చి ఆయనకు అండగా భానుప్రకాశ్‌ను సపోర్ట్‌ చేసేలా వ్యూహం పన్నితే రోజాను ఖ‌చ్చితంగా ఓడిస్తామ‌ని టీడీపీ ధీమాతో ఉంది. చంద్రబాబు తాజాగా అమెరికా పర్యటన తర్వాత నగరి టిక్కెట్‌ విషయంలో ఫైనల్‌గా ఓ డెసిష‌న్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక చిత్తూరు జిల్లాలో ఇప్ప‌టికే పీలేరు, పుంగ‌నూరు, చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల విష‌యంలో బాబు క్లారిటీకి వ‌చ్చేశారు.

Related Posts