YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే రావెల వెంట్రావు విగ్రహాన్ని ఆవిష్కరించిన కోడెల

మాజీ ఎమ్మెల్యే రావెల వెంట్రావు విగ్రహాన్ని ఆవిష్కరించిన కోడెల
మాజీ ఎమ్మెల్యే  డాక్టర్ రావెల వెంకట్రావు ప్రజల కోసం వైద్య వృత్తిని వదిలివేశారు. ఆయన ఆదర్శ భావాలు, ప్రవర్తన కలిగిన వ్యక్తి. శని, ఆదివారాలు వ్యవసాయానికి కేటాయించారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొనియాడారు సోమవారం నాడు అయన సత్తెనపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావెల వెంకట్రావు విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కోడెల మాట్లాడుతూ రావెల వెంకట్రావు గారి మొదటి వర్థంతి సంధర్భంగా కాస్యవిగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. రావెల వెంక్రటావుతో నాకు 55సంవత్సరాల అనుబంధం ఉంది. వైద్య వృత్తిలో ఆయన నాకు ఆదర్శనీయులని అన్నారు. డాక్టర్, రోగి మధ్య రిలేషన్ కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ లాగా చూపించేవాడు.ఆయనకు, నాకు రాజకీయాల్లో ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చాం. రావెల వెంకట్రావు వద్ద జీవితం నేర్చుకున్నానని అన్నారు.  సత్తెనపల్లిలో మంచి ప్రభుత్వ కార్యక్రమానికి రావెల గారి పేరు పెట్టడం జరుతుందని అయన అన్నారు.

Related Posts