YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ దళంలో గుబులు

గులాబీ దళంలో గుబులు

కేసీఆర్ ఏ క్షణాన అభ్యర్ధుల ప్రకటన చేశారో కానీ అప్పటినుంచి గులాబీ దళంలో గుబులు రేగుతోంది. టికెట్ రాని వాళ్లు అసంతృప్తితో రగలిపోతున్నారు. కొందరు వేరే పార్టీలోకి జంప్ అవుతుంటే.. మరికొందరు అభ్యర్ధుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణ్ ఖేడ్ లోనూ అదే పరిస్థితి నెలకొంది. అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు. భవిష్యత్ కార్యాచరణఫై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకీ నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది..? అసంతృప్త నేతలు ఏంచేయబోతున్నారు.. నారాయణ్ ఖేడ్ లో ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి భూపాల్ రెడ్డి కి టికెట్ కన్ఫర్మ్ చేశారు టిఆర్ఎస్ అధినేత. దీంతో టిఆర్ఎస్ నాయకులు బహిరంగంగా అసమ్మతి ప్రకటిస్తున్నారు. భూపాల్ రెడ్డికి తాము సహకరించబోమని అసమ్మతి వర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ భూపాల్ రెడ్డికి సపోర్ట్ చేయబోమని తెగేసి చెబుతున్నారు. కార్యకర్తలతో సీక్రెట్ గాసమావేశం ఏర్పాటు చేసి తమ బలాలను నిరూపించుకునే ప్రయత్నంలో తలమునకలై బిజీబిజీగా గడుపుతున్నారు. పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం... అసమ్మతి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తాం కానీ.. భూపాల్ రెడ్డి అభ్యర్థిత్వానికి మాత్రం మద్దతు ఇవ్వమని స్పష్టం చేస్తున్నారు. 
ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పై కొంత వ్యతిరేకత ఉన్నది నిజమే అంటున్నారు అక్కడి ప్రజలు. బినామీ పేర్లతో కాంట్రాక్టులు, మద్యం వ్యాపారాలు చేస్తుంటారని ఎమ్మెల్యే ఆరోపణలు వచ్చాయి.
 గతంలో హనుమంతరావు తనకు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వడానికి భూపాల్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడని బహిరంగంగానే ప్రకటించారు.. ఆధారాలను కూడా చూపించారు. కలకలం సృష్టించిన ఈ సంఘటనతో టిఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులలో లో దాగి ఉన్న అసంతృప్తిని బయట పెట్టినట్లు అయింది. 
ఈ వివాదం చినికిచినికి గాలి వానగా మారకముందే పార్టీ జిల్లా పెద్దలు జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దు మణిగేలా చేశారు. ఇద్దరి మధ్యలో వివాదం అయితే మాన్పగలిగారు కానీ... నాటినుండి హనుమంతరావు పార్టీ కార్యకలాపాలకు, నారాయణఖేడ్ నియోజకవర్గానికి దూరంగా ఉంటూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించడంతో అసమ్మతి నేతలతో తన గొంతు కలిపి మద్దతు ప్రకటిస్తున్నారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో మరొక కీలక నాయకుడు ఎమ్మెల్సీ రాములు నాయక్. గిరిజన నాయకుడుగా గిరిజన తండాల్లో ఈయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో కూడా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, రాములు నాయక్ ఎడ ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. రాములు నాయక్ రైతుబంధు చెక్కులను పంపిణీ చేయడం గతంలో పెద్ద చర్చకు దారితీసింది. భూపాల్ రెడ్డి లేకుండా కొన్ని కార్యక్రమాలను చేస్తుండటంతో అప్పుడే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. 
ఇప్పుడు అసమ్మతి నేతలను అందరిని కూడా ఒక చోటికి చేర్చే ప్రయత్నంలో తెరవెనక పావులు కలుపుతుంది ఎమ్మెల్సీ రాములు నాయక్ ని ప్రచారం జరుగుతోంది. నారాయణ ఖేడ్ అసెంబ్లీ స్థానంపై కన్నేసిన రాములు నాయక్‌ చాపికింద నీరులా ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ వదలబోమని బాహాటంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే భూపాల్ రెడ్డికి టికెట్ రావడంతో రాములు నాయక్ అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పటికైనా అధిష్టానం టికెట్ విషయంలో పునరాలోచన చేసి ఇతరులకు టికెట్ ఇవ్వాలని లేనిచో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 
ఇచ్చిన హామీలు నెరవేర్చాం, ఓట్లతో దీవించండి అని అడగాల్సిన గులాబీ నేతలు.. నేతను మార్చండి, లేదంటే నారాయణఖేడ్ రాతను మారుస్తాం అని అసమ్మతి రాగాన్ని అందుకుంటున్నారు. దీంతో వీళ్ల వ్యవహారం పార్టీకి తలనొప్పిగా తయారైంది. నారాయణఖేడ్ లో భూపాల్ రెడ్డి అభ్యర్థిత్వం కంటిన్యూ అవుతుందో..... అసమ్మతి నేతల అల్టిమేటం కు పార్టీ దిగివస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

Related Posts