YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హామీలు మరచిన కేసీఆర్

హామీలు మరచిన కేసీఆర్

ఎలాంటి కారణాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ రద్దు చేశారు. తెలంగాణలో దళితుడిని తొలి ముఖ్యమంత్రిగా చేస్తామని కేసీఆర్  మాట మార్చారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. కేజీ టు పీజీ విద్య, దళితులకు మూడు ఎకరాల భూమి పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ నిరుద్యోగులు లక్ష ఉద్యోగాలు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మాట ఇచ్చిన కెసిఆర్ పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు. ఉద్యమం సమయంలో హామీల గాని ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు కమిట్మెంట్ గా అమలు  చేస్తామన్న కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోయారు. 29 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుదామని చెప్పారు. 63 గా ఉన్న శాసన సభ్యులను 96 కు చేర్చారు. హైదరాబాద్ లో ధర్నా లు ఉండవు అన్న కేసీఆర్ తరువాత ధర్నాలు జరిగేలా చేసారని అన్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే మా లక్ష్యం అందుకే మేము మహాకూటమిక ఏర్పాటు చేసాం. కమిషన్లు కోసం మిషన్ భగీరథ మొదలు పెట్టారు. పెదవాడి కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే  పంటితో తిస్తానన్నారు.  వారి కోసం నా ప్రాణమైనా ఇస్తానననారు. కానీ కొండగట్టులో 62 మంది చనిపోయిన కనీసం చూడడానికి రాలేదని విమర్శించారు. పేదవాళ్ల కు కడుపులో పెట్టుకుంటా మన కేసీఆర్ కడుపులో కత్తులు ఉన్నాయని ప్రజలకు తెలిసిందని రమణ అన్నారు. ప్రపంచంలో మన తెలుగు వారు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు వల్లే. బాబ్లీ ప్రాజెక్టు కోసం కొట్లాడింది తెలుగుదేశం పార్టీ వల్లే. బాబ్లీ ప్రాజెక్టు ఆనాడు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటే కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ కుటుంబం తాగునీటి సమస్య అని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వంలో కేబినెట్లో మహిళలకు  గౌరవం దక్కలేదు. రమణ కు సీటు లేదని కేసీఆర్ అన్నారు. పాకు సీటు ముఖ్యం కాదు,నువ్వు ఎన్ని ప్రలోభాలకు చూపిన లొంగ లేదని అన్నారు. తెలంగాణాలో మహాకూటమి జెండా ఎగరవేయడం ఖాయం. జగిత్యాల నుంచి మహాకూటమి జైత్రయాత్ర ప్రారంభిస్తాం.  భారత ఎన్నికల కమిషన్ చెప్పవలసిన షెడ్యూలు కేసీఆర్ చేపిండని అయన విమర్శించారు.

Related Posts