YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అక్టోబర్ 1 న కరీంనగర్ కు ఎన్నికల అధికారులు

అక్టోబర్ 1 న కరీంనగర్ కు ఎన్నికల అధికారులు

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,142 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన, ఎన్నికల సిబ్బందికి శిక్షణపై దృష్టి సారించింది. అక్టోబర్‌ 1న సిబ్బంది జిల్లాకు రానున్నారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వారి సమక్షంలోనే రాజకీయ ప్రతినిధులకు వాటి పనితీరుపై స్వయంగా ఓటు వేసి చూపుతూ అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే వీవీప్యాట్‌ల పనితీరుపై జిల్లాలో మొదట జ్యూడీషియల్‌ అధికారులు, పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. మలిదశలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు. నియోజకవర్గాల వారీగా నెల రోజుల పాటు ఓటర్లకు అవగాహన కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల పెంపు, అవసరమున్న చోట కుదింపు, ప్రాంతాల మార్పు వంటి ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద గల పరిస్థితులు, బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం రెవెన్యూ, పోలీసులతో కలిసి సంయుక్తంగా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈవీఎం గోదాం వద్ద 24 గంటల నిరంతర భద్రతకు ప్రత్యేకంగా సాయుధ పోలీసులను మోహరించారు. ఈవీఎం గోదాం చుట్టూ ప్రత్యేక రక్షణ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.అయితే.. బెంగళూర్‌ నుంచి 1,430 కంట్రోల్‌ యూనిట్లు, 1,830 బ్యాలెట్‌ యూనిట్లు, 1,540 వీవీ ప్యాట్‌ పరికరాలు జిల్లాకొచ్చాయి. పోలింగ్‌ కేంద్రాలతో పోలిస్తే ఇవి అదనం. సాంకేతిక సమస్యలు వస్తే అదనపు పరికరాలను వినియోగించనున్నారు. జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్‌ నియోజకవర్గాలలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు వీటిని వినియోగించనున్నారు. ఇప్పటికే గోదాముల్లో నిల్వ ఉన్న ఈవీఎంలను హైదరాబాద్‌లోని ఈసీఎల్‌ కంపెనీకి తరలించారు. 13,221 బీయూలు, 8,631 సీయూలను తరలించారు.   ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులతోపాటు 18 ఏళ్లు నిండిన వారి పేర్లను జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.ఈవీఎంల పనితీరుపై వివిధ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఈవీఎంలకు అనుసంధానంగా వీవీ ప్యాట్‌ యంత్రాలు (ఓటు నిర్ధారణ) ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వారు తమ ఓటు ఏ గుర్తుపై పడిందో తెలుసుకునే అవకాశముంది. అయితే.. రశీదులు మాత్రం ఎన్నికల సిబ్బంది తీసుకునే అవకాశముంది. చివరగా ఈవీఎంలో వేసిన ఓటు కంట్రోల్‌ యూనిట్‌తోపాటు వీవీ ప్యాట్‌లలో వచ్చిన రశీదుల సంఖ్యను చూపనున్నారు. ఇప్పటివరకు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలకు వీవీ ప్యాట్‌ సౌకర్యం లేదు. వీవీ ప్యాట్‌ ఉన్న ఈవీఎంలను వచ్చే ఎన్నికల్లో వినియోగించనున్నారు. జిల్లాకు వచ్చిన ఈవీఎంల గుర్తింపు సంఖ్యను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.ఆన్‌లైన్‌లో నమోదు అనంతరం అవి పనిచేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అనంతరం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరును వివరిస్తారు. పట్టణ, గ్రామాల్లోనూ ఈవీఎం, వీవీప్యాట్‌ల పనితీరుపై అవగాహన కల్పించనున్నారు. స్వయంగా యంత్రాలలో ఓటు వేసి చూపించనున్నారు.   కొత్త ఈవీఎంలు రావడంతో వీటి పనితీరు వినియోగంపై బెల్‌ కంపెనీకి చెందిన ఇంజినీరింగ్‌ సిబ్బంది జిల్లా అధికారుల సమక్షంలో ఫస్ట్‌లెవల్‌ చెకింగ్‌ చేపట్టనున్నారు.

Related Posts