YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దసరా తర్వాత తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్...?

దసరా   తర్వాత తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్...?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల తేదీల ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌‌ను అక్టోబరు 10న విడుదల చేయనున్నారు. ఒకవేళ ఆరోజు కుదరకపోతే అక్టోబరు 12న వెలువడే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికార వర్గాలు వెల్లడించాయి. అక్టోబరులోనే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తవుతుందని.. నవంబర్‌ 15–20 తేదీల మధ్య ఎప్పుడైనా పోలింగ్‌ జరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడటానికి కొద్దిరోజుల ముందే తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. నాలుగు రాష్ట్రాలతోపాటే డిసెంబర్‌లోనే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుపుతామని కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా వెల్లడించినా.. ఎక్కువకాలం ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారంలో ఉండటం భావ్యం కాదన్న సుప్రీంకోర్టు సలహా మేరకు.. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలన్న నిర్ణయానికి కమిషన్‌ వచ్చింది. తెలంగాణకు సంబంధించి తుది ఓటర్ల జాబితా అక్టోబర్‌ 8న ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అనంతరం అక్టోబర్‌ 10 లేదా 12 తేదీల్లో షెడ్యూల్‌ వెలువరించే ప్రయత్నంలో కమిషన్‌ ఉందని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు

Related Posts