YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యువనేస్తం నాలుగు లక్షల మంది కోసం 20 కోట్లు రిలీజ్

యువనేస్తం నాలుగు లక్షల మంది కోసం 20 కోట్లు రిలీజ్

గత ఎన్నికల్లో హామీ మేరకు నిరుద్యోగ భృతిని అందజేయడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే  దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం పేరుతో నిరుద్యోగులకు వచ్చే నెల నుంచి నిరుద్యోగ భృతి చెల్లించనున్నారు. తొలి నెల అక్టోబరులో ప్రాథమికంగా నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు దీనిని చెల్లించేందుకు రూ.40 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.1000 కోట్ల నుంచి ఈ మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు రాష్ట్ర యువజన సంక్షేమ శాఖకు అనుమతించింది.
ఈ మేరకు యువజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. నిరుద్యోగ భృతికి రూ.40 కోట్లు, పరిపాలనపరమైన ఖర్చులు, పథకం ప్రచారం కోసం రూ.6.67 కోట్లు, దీనికి ఐటీ సేవలందివారికి రూ.18లక్షలు మొత్తం రూ.46.85 కోట్లు డ్రా చేసుకునేందుకు అనుమతించినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.మరోవైపు  ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగభృతిని పొందేందుకు అర్హులు లక్షకు చేరుకున్నారు. సెప్టెంబరు 14న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి బుధవారం ఉదయానికి  3.87లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,05,444 మందిని అర్హులుగా గుర్తించినట్లు వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఈ పథకం కింద సుమారు 12లక్షల మందికి  నిరుద్యోగభృతిని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అర్హులైన వారికి అక్టోబరు 2న నిరుద్యోగభృతిని బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. మరోవైపు 51,065  ఫిర్యాదులు నమోదు కాగా.. వీటిలో 8,449 పరిష్కరించారు. 9,868 మంది తమకు భృతి అవసరం లేదని స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఫిర్యాదుల్లో ఎక్కువశాతం విద్యార్హతకు సంబంధించినవే ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts