YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

దశమికి అరవింద సమేత..

దశమికి అరవింద సమేత..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘అరవింద సమేత’. పూజా హెగ్డే హీరోయిన్. విజయదశమి కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.ఇదివరకే ఒక్కొక్కటిగా విడుదలైన టీజర్, పాటలు మూవీపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ‘పెనివిటి’ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు తమన్‌ స్వరాలు సమకూర్చిన మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు కీలకపాత్రల్లో నటించారు.

Related Posts