YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అన్ని రంగాల్లోనూ ఏపి నిఅగ్రగామిగా నిలిపా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

అన్ని రంగాల్లోనూ ఏపి నిఅగ్రగామిగా నిలిపా          ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలంలో ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లోనూ అగ్రగామి నిలపడంలో దినేష్ కుమార్ పాత్ర మరువలేనిది. సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు తీయించారు. కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటూ నిధులు రాబట్టడంలో ఆయన విజయవంతమయ్యారు. రాష్ట్రంలో అన్ని శాఖ  కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ పాలనను గాడిలో పెట్టారు. రాష్ట్రంలో అన్ని శాఖలనూ కంప్యూటరీకరించారు. ఈ ఆఫీసు విధానంతో పాలనను ప్రజల చెంతకు చేర్చారు. 2017 ఏప్రిల్ ఒకటో తేదీన  ఆయన సీఎస్ బాధ్యతలు స్వీకరించారు.
కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టంలో సఫలం
కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అధిక నిధులు రాబట్టారు. వేగవంతంగా యూసీలు, ఇతర రసీదులు సకాలంలో అందజేశారు. 2017-18 లో రూ.9,700 కోట్లకు లక్ష్యంగా ఉంటే రూ.17,500  కోట్లు తీసుకురాగలిగారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.10,372 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చారు. గతేడాది 33 శాతం అధికంగా నిధులు రాబట్టారు. ఇది ఒక చరిత్ర. సాధించిన నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం కలిగింది. 
‘ఉపాధి’తో గ్రామాలకు కొత్తసొబగులు 
పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుంటూ గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పనకు దినేష్ కుమార్ పెద్దపీట వేశారు. కేంద్రపంచాయతీరాజ్ శాఖతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, దేశంలో మిగిలిన రాష్ట్రాలకంటే అధిక నిధులు రాబట్టారు. రాష్ట్ర స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ద్వారా  జాతీయ ఉపాధి హామీ నిధులతో 1776 గ్రామ పంచాతీయ భవనాలు, 4,643 అంగన్వాడీ భవనాలు, 15, 000 కి.మీ. సి.సి. రోడ్లు, 2.46 లక్షల ఫామ్ పాండ్ల నిర్మాణంతో పాటు గ్రామీణ ప్రజల శ్రేయస్సు కోసం అనేక మౌలిక వసతులు కల్పించారు. హార్టీకల్చర్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ భూములను అభివృద్ధి చేయించారు. గిరిజన సంక్షేమ శాఖ, నాబార్డు నిధులతో గత నాలుగన్నరేళ్లలో ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా 5 వేల పంప్ సెట్లు ఏర్పాటు చేయించారు. ఎన్టీఆర్ జలసిరి రెండో ఫేజ్ లో భాగంగా 7 వేల సోలార్ పంప్ సెట్లు మంజూరు చేయించారు. ఉపాధి హామీ, ఇందిరా జల ప్రభ, ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా బంజరు భూముల్లో మామిడి, ఇతర పండ్ల తోటలు పెంపకానికి ప్రోత్సాహించారు. వాటర్ షెడ్ల ఏర్పాటుతో కొండ ప్రాంతాల్లో మొక్కల పెంపకం పెద్దఎత్తున చేపట్టారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు.
గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట
సీఎస్ గా దినేష్ కుమార్ గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారు. గిరిజన సంక్షేమ శాఖాధికారులను, ఐటీడీపీ పీవోలను సమన్వయంతో పనిచేయించారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడానికి కృషి చేశారు. 2016-17 బడ్జెట్ లో కేటాయించిన ఎస్టీ నిధులు 79 శాతం వినియోగించారు. 2017-18లో 95.11 శాతం వినియోగించి గిరిజనుల సంక్షేమానికి పాటుపడ్డారు. ఈ నిధులతో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, మౌలిక సదుపాయల కల్పించారు. గిరిజనుల జీవనోపాధికి విరివిగా రుణాలు అందజేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి కల్పనకు, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.400 కోట్లు, రూ.1000 రోడ్ల అనుసంధానానికి వినియోగించారు.
పౌష్టికాహారం కల్పనతో ఉత్తమ ఫలితాలు...
మహిళలు, బాలికలు, తక్కువ బరువుతో జన్మించిన శిశువుల్లో రక్తహీనత నివారణకు సీఎస్ దినేష్ కుమార్ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందుకోసం పౌష్టికాహారం పంపిణీకి చర్యలు తీసుకున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖాదికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పౌష్టికాహారం పంపిణీకి పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. దీంతో గర్భిణుల్లో రక్తహీనత నివారణతో పాటు శిశువులు బరువుతో పాటు ఎత్తు కూడా పెరిగారు.
పేదల చెంతకు కార్పొరేట్ వైద్య సేవలు...
సీఎస్ దినేష్ కుమార్ హయాంలో అమలు చేసిన ఆరోగ్య పథకాలు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యప్రదేశ్ గా నిలబెట్టాయి. కార్పొరేట్ వైద్య సేవలు పేదలకు చెంతకు చేరాయి. తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ పథకం కింద 5.6 లక్ష మంది మహిళలకు, చంద్రన్న సంచార చికిత్స వాహనాల ద్వారా కోటి మందికి ఎన్టీఆర్ వైద్య పరీక్ష ద్వారా 1.20 కోట్ల మందికి, ముఖ్యమంత్రి ఐ కేంద్రాల ద్వారా లక్షా 80 వేల మంది ఎంతో లబ్ధి కలిగింది. 2,628 కిడ్నీ రోగులు  లక్షా 77 వేల ఉచిత డయాలసిస్ సేవలను అందుకుంటున్నారు. మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ ద్వారా 30 ఏళ్ల దాటిని 14 లక్షల మంది మహిళలకు ఏడు రకాల క్యాన్సర్ పరీక్షలు అందించారు. ఏజెన్సీలో మొబైల్ హెల్త్ సర్వీసులతో పాటు 108తో అత్యవసర సేవలను అందించారు.
చంద్రన్నబీమా చెల్లింపుల్లో 97 శాతం సంతృప్తి
సీఎస్ గా దినేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తరవాత పీఎంజేజేబీవై - చంద్రన్న బీమా చెల్లింపులు మరింత వేగవంతమయ్యాయి. చంద్రన్న బీమాలో 2.46 కోట్లమంది తమ పేర్లను ప్రజా సాధికార సర్వేలో నమోదు చేసుకున్నారు. 54,664 బాధిత కుటుంబాలకు 88  శాతం మేర రూ.844 కోట్లను క్లయిమ్ రూపంలో చెల్లించారు. క్లయిమ్ లో చెల్లింపుల్లో బాధితకుటుంబాల నుంచి 97 శాతం మేర సంతృప్తి వ్యక్తమైంది.
చురుగ్గా పేదల ఇళ్ల నిర్మాణాలు...
రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించే దిశగా సీఎస్ దినేష్ కుమార్ వడివడిగా అడుగులు వేశారు. అర్హులకు పక్కా ఇళ్ల యోగం కల్పించడంతో పాటు నిధులు విడుదలలో పారదర్శతకతకు పెద్దపీట వేశారు. ఆధార్ అనుసంధానం చేస్తూ ఇళ్లకు జియో ట్యాగింగ్ చేసిన రాష్ట్రంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో రూ.5,524 కోట్లతో 19 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. వాటిలో 5 లక్షలపైగా ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యయాయి.
స్ఫూర్తివంతమైన పాలన...
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పాలనపరంగా ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించడానికి ఆయా శాఖలతో సీఎస్ దినేష్ కుమార్ నిరంతర సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. పాలనాపరమైన ప్రగతి కోసం ఎప్పటికప్పుడు ఆ కమీటీలతోనూ, డిపార్టుమెంట్ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతోనూ నెలవారీ సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ అధికారుల్లో ఉత్తేజం నింపేవారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి, రాబోయే 15 ఏళ్లలో కోటీ 44 లక్షల ఉద్యోగాలు కల్పనకు కార్యచరణ రూపొందించారు.
ఏపీ పునర్విభజన చట్టం అమలు కోసం...
రాష్ట్ర పునర్విభజన అమలు కోసం సీఎస్ దినేష్ కుమార్ విశేష కృషి చేశారు. అటు కేంద్రంతోనూ, ఇటు తెలంగాణ ప్రభుత్వంతోనూ ఎప్పటికప్పుడు చర్చిస్తూ వచ్చారు. 9, 10 షెడ్యూల్ లో ఉన్న సంస్థల విభజన, ఉద్యోగుల మ్యూచవల్ ఫండ్, ఉద్యోగుల బదలాయింపులకు తెలంగాణ ప్రభుత్వంతో నిరంతర చర్చలు జరుపుతూ వచ్చారు. ప్రభుత్వంలో కాగిత రహిత పాలనకు సీఎస్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అన్ని కార్యాలయాలనూ కంప్యూటరీ కరించారు. వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, విద్య, వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ శాఖల్లో అమలవుతున్న పథకాల అమలు కోసం నిరంతర పర్యవేక్షణ జరిపేవారు.
సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు...
తనకు సీఎస్ గా పనిచేసే అవకామిచ్చినందుకు సీఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు. సమర్ధుడైన సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది. విధి నిర్వహణలో తనకు పూర్తిస్వేచ్ఛనిచ్చారు. నా పదవీ కాలం పూర్తి సంతృప్తి నిచ్చిందని దినేష్ కుమార్ పేర్కొన్నారు.

Related Posts