YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మూడు సీట్లకోసం కోదండరామ్ పోర్లు దండాలు

మూడు సీట్లకోసం కోదండరామ్ పోర్లు దండాలు

దేశ వ్యాప్తంగా 2014 మోడీ పై మంచి పాలన జరుగుతుంది అనుకున్నారు. పేద ప్రజలకు ఏమి చేసినం అని చెప్పడానికి బీజేపీ కి సమాధానం లేదు. అమిత్ షా స్మృతీ ఇరానీ  తెలంగాణ కి వచ్చినా సమయం లో తెలంగాణ కు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పలేకపోయారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు కరీంనగర్ కు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు  మంత్రి సమక్షంలో తెరాసాలో చేరారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య కి మార్గం చూపడం అంటే ప్రైవేట్ రంగం లో ఉపాధి కల్పించాలి అది కూడా చేయలేదు. రాష్ట్రాలు కట్టే పన్నులు లేకపోతే కేంద్రం ఎక్కడ నుంచి ఇస్తుందని అయన అన్నారు. మనకు కేంద్రం నుంచి ఇస్తున్నా వాటి కంటే కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నా నిధులు ఎక్కువ. చంద్రబాబు నాయుడు కేంద్రం తో గిల్లి లొల్లి చేస్తున్నారు...అని మోడీ పార్లమెంట్ లో అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ మసకబరుతుంది..  పదహారు పార్లమెంట్ స్థానాలు తెలంగాణ లో గెలిస్తాం.  రాహుల్ గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ మన్నేనని అయన అన్నారు. ఉత్తమ్ ఆరు అడుగులు ఉంటారు మేము లేస్తే అంటే అన్నే అడుగులు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ని ప్రజలు చూడలేదా....కాంగ్రెస్ పార్టీ గూర్చి ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. హైద్రాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలో బీజేపీ లక్ష్మణ్,కిషన్ రెడ్డి గెలుస్తాం అని ఎగిరారు..ఏమైంది.. కాంగ్రెస్ పార్టీ హామీలను చూస్తే వాళ్లకు మోక్కాలి...ఉత్తమ్ హామీలు అయ్యవి కాదు..పొయ్యేది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లో లగ్గం కానీ పిల్లలకు పిల్లను వెతుకుతారు అని ప్రకటిస్తారు అని విశ్వసనీయ సమాచారం.. తెలంగాణ ప్రజల అవసరాల కోసం కేసీఆర్ అవసరం అయితే దేవున్ని అయిన ఎదురిస్తారు అని ప్రజలు తెలుసు. చంద్రబాబు ఎన్ టి ఆర్ కి వెన్నుపోటు పోడచారు. రెండవ సారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఆత్మకు కూడా శాంతి కలుగకుండా చేస్తున్నారని అన్నారు. మూడు  సీట్స్ కోసం కాంగెస్ పార్టీ చుట్టూ పొర్లు  దండాలు పెడుతున్నారు కోదండరామ్. మహా కూటమి అంటున్నారు..తెలంగాణ పాలిట ద్రోహ కూటమి. 2009 లో తెలంగాణ గూర్చి ఒప్పుకున్నా చంద్రబాబు.  ఇతర పార్టీ లతో పొత్తు పెట్టుకోమని ఏ అమరుడు చెప్పారు కోదండరాం సార్ కని అన్నారు. చంద్రబాబు నాయుడు టిక్కెట్ ఇవ్వాలి అంటే అందరకీ వెళ్ళాలి. ఢిల్లీ కి గులాం కాదు...అమరావతి కి దాసున్ని కాదని అన్నారు

Related Posts