YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పశువుల సంతలో అక్రమాలు!

పశువుల సంతలో అక్రమాలు!

ఖమ్మం జిల్లా చండూరులో పశువుల సంత ఉంది. ఈ సంత ప్రాముఖ్యమైనది. పశువుల క్రయవిక్రయాలకు ప్రధాన కేంద్రంగా ఉంటోంది ఈ మార్కెట్. బస్టాప్‌కు పక్కనే ఉండే ఖాళీ స్థలంలో ఈ మార్కెట్ నిర్వహిస్తుంటారు. ప్రతి శుక్రవారం అన్నిరకాల పశువుల బిజినెస్ జోరుగా సాగుతుంది. ఇంతటి కీలక సంతలో అవకతవకలు సాగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పశువుల ఆరోగ్యాన్ని నిర్ధరించే ధృవీకరణ పత్రాలు, ఈ సర్టిఫికెట్స్ ఇచ్చే డాక్టర్లు ఇక్కడ ఉండడంలేదు. పైగా పర్యవేక్షించిన అధికారులూ పెద్దగా కనిపించడంలేదు. దీంతో మార్కెట్‌లో అక్రమాలు సర్వసాధారణమైపోయినట్లు పలువురు కొనుగోలుదారులతో పాటూ విక్రేతలు సైతం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పశువుల క్రయవిక్రయాలు పెద్దఎత్తున సాగే ఈ సంతపై పర్యవేక్షణ లోపించడం సమస్యాత్మకంగా మారిందని ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. నిబంధనలు పెద్దగా ఖాతరు చేయకపోవడంతో పలువురు నష్టపోతున్నారని అంటున్నారు. వాస్తవానికి చుండూరు పశువుల సంతలో ప్రతీ శుక్రవారం వందలాదిగా పశువుల అమ్మకాలు సాగుతుంటాయి. వందలాది ఆవులు, ఎద్దులు, మేకలు, గెదెలతో బిజినెస్ చేస్తుంటారు. కొనుగోలుదారుల్లో రైతులు కంటే దళారులు, కబేళా వ్యాపారులే ఎక్కువగా ఉంటున్నారని సమాచారం. అయితే నిబంధనల పట్టింపు లేకపోవడమే సమస్యకు తావిస్తోంది. అక్రమాలు జరుగుతున్నాయని పలువురు పెదవి విరుస్తున్నారు.
గ్రామాల నుంచి చుండూరుకు పశువులను తీసుకొచ్చి అమ్ముతుంటారు. కొందరు దళారులు, కబేళా వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేసిన పశువులను హైదరాబాదులోని చెంగిచర్లలోని అనుమతి పొందిన పరిశ్రమతోపాటు ఇతర ప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తున్నారని సమాచారం. అయితే ఈ వ్యవహారం నిబంధలనకు తగ్గట్లుగా సాగడంలేదన్నది కొందరి ఆరోపణ. ఓ ఆవును కబేళాకు అమ్మాలంటే వైద్యాధికారి జారీ చేసిన పత్రం ఉండాలి. కానీ ఇలాంటివేవీ లేకుండానే పశువులను కబేళాలకు విక్రయించేస్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక క్రయవిక్రయాలపై పర్యవేక్షణ.. మార్కెట్‌లో అంతా నిబంధనలకు అనుగుణంగా సాగుతుందీ లేనిదీ పర్యవేక్షించాల్సిన అధికారులు ఉదాసీనంగా ఉంటున్నట్లు చాలాకాలంగానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షణలోపం వల్ల కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి. ప్రధానంగా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సంత నిర్వహణపై పెద్దగా దృష్టి సారించడంలేదని, పశువులకు ఏర్పాటు చేయాల్సిన కనీసవసతులపైనా నిర్లక్ష్యంగా ఉంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి చుండూరు పశువుల సంతలో అన్ని కార్యకలాపాలు నిబంధనలకు అనుగుణంగా సాగేలా చర్యలు తీసుకోవాలని, అవకతవకలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా చూడాలని అంతా కోరుతున్నారు.

Related Posts