YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాణిపాకంలో భద్రతా డొల్ల

కాణిపాకంలో భద్రతా డొల్ల
కాణిపాకం ఆలయం వద్ద భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నాలుగు వందల మందికి పైగా పోలీసులు పహరా కాశా రు. వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది వరకు భక్తులు ఆలయానికి వచ్చారు.రథోత్సవం, పుష్పపల్లకి, తెప్పోత్సవం వంటి కార్యక్రమాలకు రెండువందల మందికి పైగా పోలీసులను ఇక్కడ బందోబస్తుకు నియమించారుఈక్రమంలో పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణిస్తే కనీస సమాచారం కూడా ఇవ్వకుండా లాడ్జి యజమాని ఆ మృతదేహాన్ని తీసుకు వెళ్లి సమీపంలోని ఓ చెరువులో ఖననం చేశారు. దారి పొడవునా సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఉన్నా నాలుగు రోజుల వరకు పోలీసులకు లాడ్జిలో వ్యక్తి మరణించిన ఘటన తెలియకపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.కాణిపాకం గ్రామంలో పోలీసు స్టేషన్‌ను అనుసంధానం చేస్తూ నలభైకి పైగా సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటితో పాటూ చుట్టుపక్కల ఉన్న లాడ్జిల్లో సైతం మరో రెండు వందల వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని అనుక్షణం పోలీసు సిబ్బంది పహారా కాసే విధంగా అనుసంధానం చేశారు. వీటిలో ఎప్పటికప్పుడు దృశ్యాలు రికార్డు చేస్తుంటారు. అయినా భద్రత మాత్రం గాలిలో దీపంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుటేజీ  కూడా కనిపించకుండా పోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతన్నాయి. రథోత్సవం రోజున.. అత్యాధునిక సదుపాలయాలతో కూడిన కమాండ్‌ కంట్రోల్‌ వాహనంతో అడుగడుగునా పోలీసులు పహారా కాశారు. అయితే పోలీసు స్టేషన్‌కు ఐదువందల మీటర్లు దూరంలో ఉన్న ఒక ప్రైవేటు లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందితే.. ఆ మృతదేహాన్ని పట్టపగలు బైక్‌పై తరలిస్తే.. గుర్తించలేకపోయారు. దీనిపై తీవ్ర స్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts