YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ సెంటిమెంట్ పక్కన పెట్టేశారా...

 జగన్ సెంటిమెంట్ పక్కన పెట్టేశారా...
వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తూ వచ్చే ఎన్నికల్లో కీలక అంశాన్నే పక్కన బెట్టారా? ఆయన పాదయాత్రలో ఉన్నా మిగిలిన పార్టీ శ్రేణులు ఏం చేస్తున్నాయి. ఒకవైపు అధికార తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్ తో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తుంటే వైఎస్ జగన్ టీం మాత్రం సెంటిమెంట్ ను పక్కన పెట్టేసిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రధానంగా జగన్ పార్టీ ప్రత్యేక హోదా అంశంపైనే దృష్టి పెట్టింది. హోదా కోసం అనేకచోట్ల సభలు పెట్టింది. యువభేరిలు పెట్టి యువతలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే జగన్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత కొద్దిరోజుల పాటు ప్రత్యేక హోదాపై హడావిడి చేసిన నేతలు ఇప్పుడు కామ్ అయిపోయారు.నిజానికి ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి పోరాటం చేసింది జగన్ మాత్రమే. ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే ఎన్నికలు వచ్చే సమయానికి చేజేతులా వైసీపీ ఆ పక్కనపెట్టిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధర్మ పోరాట దీక్షల పేరుతో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ జిల్లాల వారీగా తిరుగుతున్నారు. గత ఆరు నెలల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకహోదా ప్రస్తావించకపోవడానికి కారణాలపై పార్టీలోనూ చర్చ జరుగుతుండటం గమనార్హం.వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక హోదా కోసం చేయాల్సిందంతా చేశారు. మోదీ ప్రభుత్వంపై తొలుత అవిశ్వాసం పెట్టింది జగన్ పార్టీ మాత్రమే. ఆ పార్టీ అవిశ్వాసం పెట్టిన తర్వాత ఎంటర్ అయిన తెలుగుదేశం పార్టీ దాన్ని అందిపుచ్చుకుంది. జాతీయ స్థాయిలో ప్రచారం తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత ఆమరణ దీక్షకు కూడా దిగారు. అయినా అనుకున్న మైలేజీ తెచ్చుకోవడలో వైసీపీ విఫలమయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.కనీసం ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఎంపీల చేతనైనా రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి ఉంటే కొంత పార్టీకి హైప్ వచ్చేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కాని అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉండటంతో ప్రత్యేక హోదా గురించి పార్టీ నేతలు కూడా పట్టించు కోవడం లేదు. ఇది గమనించిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాను అందిపుచ్చుకుంది. తమవల్లనే ప్రత్యేక హోదా సాధ్యమని ఊరూవాడా చెబుతుంది. ప్రత్యేక హోదా పై వైసీపీ మాట్లాడకపోవడాన్ని కూడా బీజేపీ నేతలు అడ్వాంటేజీగా తీసుకున్నారు. టీడీపీ ధర్మపోరాట దీక్షలు చేస్తుంటే వైసీపీ వంచనపై పోరాట దీక్షలు చేసింది. అయితే ఇప్పటి వరకూ కేవలం నాలుగుచోట్ల మాత్రమే వైసీపీ వంచనపై పోరాట దీక్షలు చేసింది. వైసీపీ నెల్లూరు, విశాఖ, గుంటూరు, అనంతపురంలలో మాత్రమే వంచనపై పోరాట దీక్షలు చేసింది. ఇప్పటికైనా వైసీపీ నేతలు ప్రత్యేక హోదాపై దృష్టి పెట్టకపోతే కష్టమేనంటున్నారు విశ్లేషకులు.

Related Posts