YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వారసులకు సీట్లు లేవు

వారసులకు సీట్లు లేవు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దించాలని ఉవ్విళ్లూరుతున్న సీనియర్‌ నేతలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం షాకిచ్చినట్లు తెలుస్తోంది. వారసులకు టికెట్లు ఇవ్వలేమని అవసరమైతే సీనియర్లు తమ సీట్లను త్యాగం చేసి వారసులను బరిలో నిలపాలని సూచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం తో తెలుస్తుంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ కాక పెరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ లో ఇప్పుడు సీట్ల గోల చివరి దశకు చేరుకుంది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలందరూ తమతోపాటు తమ వారసుల్లో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని భీష్మించుకు కూర్చుంటున్నారట. అంతేకాదు ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్‌ పెద్దలను కలుస్తూ టికెట్ల కోసం లాబీయింగ్‌ చేస్తున్నట్లు వినికిడి. దీంతో కాంగ్రెస్‌ లో పలువురు సీనియర్లు తమ వారసులను వెంటబెట్టుకొని దిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అధిష్ఠానం పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో తమతోపాటు తమ వారసులకూ సీట్లివ్వాలని విన్నవిస్తున్నారు. వారిని గెలిపించుకునే బాధ్యత తమదేనని హామీ ఇస్తున్నారు. అయితే వారి విన్నపాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సానుకూలంగా స్పందించడం లేదని తెలుస్తోంది. వారసత్వ రాజకీయాలు చేస్తున్నారనే ముద్ర ఇప్పటికే పార్టీపై ఉందని, ఆ ముద్రను తొలగించుకోవాలని చూస్తున్న పరిస్థితుల్లో మళ్లీ వారసులకు సీట్లడగడమేంటని నేతలను అధిష్ఠానం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒక కుటుంబానికి ఒక టికెట్‌ మాత్రమేనని స్పష్టంగా సెలవిచ్చిన్నట్లు తెలిసింది. దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని టిపిసిసి అధ్యక్షులకు ఉత్తర్వులు అందాయి. కానీ పీసీసీ చీఫ్‌ ఉత్తవ్‌ు కు మాత్రం ఇందులోంచి మినహాయింపు వున్నటు ్లపార్టీ వర్గాలు చెప్పూకుంటున్నాయి. ఉత్తవ్‌ు హుజూర్‌ నగర్‌ నుంచి ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి టికెట్లు పొంది గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిట్టింగ్‌ లు కావడంతో వారికి సీటకు ఢోకా లేదని స్పష్ట మైంది. మరి మా పరిస్థితి ఏంటని ఇప్పుడు కాంగ్రెస్‌ సీనియర్లంతా ప్రశ్నిస్తున్నారు. పార్టీలోని అందరికి ఒకే న్యాయం వుండాలని అధిష్టానికి తెలిపిన్నట్లు తెలిసింది. తామైతే వారసులకు సీట్లు ఇవ్వలేమని, అవసరమైతే మీరే సీటు త్యాగం చేసి పిల్లలను బరిలో దించుకోవాలని కూడా పార్టీ స్పష్టం చేసిందట. దీంతో వారసుల రాజకీయ అరంగేట్రంపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు ప్రస్తుతం నిరాశలో ఉన్నారని సమాచారం. మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ తాను గోషామహల్‌ నుంచి బరిలో దిగాలని – తన కుమారుడు విక్రవ్‌ు గౌడ్‌ ను ముషీరాబాద్‌ నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నారు.సికింద్రాబాద్‌ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కూడా తన కుమారుడు అనిల్‌ కుమార్‌ కు ముషీరాబాద్‌ టికెట్‌ ఇవ్వాలని అడుగుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ తన కుమార్తె స్నిగ్ధను మక్తల్‌ నుంచి బరిలో నిలపాలని ఆశిస్తున్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి తన సిట్టింగ్‌ స్థానమైన నాగార్జునసాగర్‌ తనకు – కుమారుడు రఘువీర్‌ రెడ్డికి మిర్యాలగూడ సీటు అడుగుతున్నారని తెలుస్తోంది.ఉమ్మడి ఏపీలో హోంమంత్రిగా చేసిన సబితా ఇంద్రారెడ్డి ఈసారి కాంగ్రెస్‌ ను రెండు సీట్లు కోరుతున్నారు. తనకు మహేశ్వరం, తన కుమారుడు కార్తీక్‌ రెడ్డికి రాజేందన్రగర్‌ సీట్లు అడుగుతున్నారని విస్వసనీయ సమాచారం. మరో సీనియర్‌ నేత గీతారెడ్డి ఈసారి తన కుమార్తె మేఘనారెడ్డిని ఈసారి అసెంబ్లీ బరిలో దించేందుకు రెడీ అయ్యింది. ఆమెకు తన జహీరా బాద్‌ టికెట్‌ ఇచ్చి తనకు వేరే సీటు ఇవ్వాలని కోరుతున్నారట. లేకపోతే కూతిరి కోసం ఎంపిగా పోటీచేస్తానని గీతారెడ్డి చెబుతున్నట్లు తెలిసింది. పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క తన సోదరుడు మల్లు రవిని ఈసారి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నారు. వీరికి రెండు సీట్లు కావాలని అడుగుతున్నారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా తనతోపాటు తన కుమార్తెల్లో ఒక్కరికి కాంగ్రెస్‌ టికెట్‌ కావాలని కోరుతున్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తవ్‌ు మొదలుపెట్టిన ఫ్యామిలీ ప్యాక్‌ సీట్ల కోసం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లంతా డిమాండ్‌ చేస్తుండడంతో కాంగ్రెస్‌ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఇస్తే పార్టీకి ఏ మేర లాభం, ఇవ్వకపోతే పార్టీకి ఏ మేర నస్టమో అంచనాను పార్టీ అధిష్టానం అంచనా వేస్తున్నట్లు తెలిసింది.

Related Posts