YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తొలి సంతకం హోదాపైనే ప్రీ మేనిఫెస్టో విడుదల చేసిన రఘువీరారెడ్డి

తొలి సంతకం హోదాపైనే ప్రీ మేనిఫెస్టో విడుదల చేసిన రఘువీరారెడ్డి
మంగళవారం నుంచి శ్రీకాకుళంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఏపీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను బిజేపి నెరవేర్చలేదు. టిడిపి 600 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదు. వైఎస్ జగన్ ఆరువేల హామీలు ఇచ్చారు. ఈ మూడు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని అయన విమర్శించారు. సోమవారం నాడు అయన విజయవాడలో కాంగ్రెప్ ప్రీ మేనిఫెన్టోను విడుదల చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో మూడు ప్రజలను ముంచాయి. ప్రాంతీయ పార్టీలకు హోదా తెచ్చే శక్తి,ఇచ్చే శక్తి లేదు. రాష్ట్రంలో అసలైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చిన హామీలను అమలు చేయగలుగుతుందని అన్నారు. బిజేపి–తెలుగుదేశం పార్టీలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయి. రాష్ట్రంలో,కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉంది.అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తొలిసంతకం చేస్తామని అన్నారు. ప్రజలనుంచి సలహాలు సూచనలను 44 వేల పోలింగ్  బూత్ లలో ప్రతి బూత్ లో ఒక పుస్తకం ఏర్పాటుచేసి అందులో నమోదు చేస్తాం. ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను ఫైనల్ గా ప్రకటిస్తాం. ప్రతి డ్వాక్రా గ్రూప్ కు రెండులక్షల రూపాయల రుణమాఫి చేస్తాం.చేనేతలకు రుణమాఫి చేస్తామని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తాం. పెన్సన్ విధానంలో పూర్తిగా మార్పు చేస్తాం. 50–60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి 2 వేల రూపాయల పెన్సన్ ,60 సంవత్సరాల పైబడిన వారికి 2,500 పెన్సన్ ,70 సంవత్సరాల పైబడిన వారికి 3 వేల రూపాయల పెన్సన్ ఇస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీలో అన్ని రకాల వ్యాధులను చేరుస్తాం.వ్యయపరిమితిని రెండు నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతాం. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి ద్వారా నీటిని అందిస్తాం. సిపిఎస్ విదానం రద్దు చేస్తాం.పాదపెన్సన్ విదానం తెస్తాం. బిసిలకు, మైనారిటిలకు సబ్ ప్లాన్ చట్టబద్దం చేస్తాం. ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ ను కఠినంగా అమలు చేస్తామని అన్నారు. బిసిలకు ఇబ్బంది లేకుండా కాపులను షెడ్యూల్ 9 లో చేర్పించి రిజర్వేషన్లు కల్పిస్తాం. పేద విద్యార్దులకు ఫీజు రీయంబర్స్ మెంట్ సక్రమంగా అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపు ఉద్యోగాల ఖాళీలను భర్తి చేస్తాం. ప్రైవేటు రంగంలో కూడా ఎస్సిఎస్టి బిసి,మైనారిటిలకు రిజర్వేషన్లు అమలుకు ప్రయత్నం చేస్తాం. ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం చేస్తామని అన్నారు. 

Related Posts