YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గ్రేటర్ లో పాగానే లక్ష్యంతో కమలం

గ్రేటర్ లో పాగానే లక్ష్యంతో కమలం
కేంద్రంలో అధికారంలో ఉన్న కమల దళం తెలంగాణలోనూ సత్తాచాలనుకుంటోంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పలు వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే కార్యకర్తలతో కలిసి పలువురు తామే అభ్యర్థుల మంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అక్టోబర్ నాలుగున కమిటీలపై చర్చలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్‌లోని 24నియోజకవర్గాల్లో పార్టీ నాయకులతో మంత్రి శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, తదితరులు సమావేశం నిర్వహించనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులతో స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకుని, అధికార పార్టీకి ధీటైన నాయకుడిని నిలబెట్టనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరికి సీటు ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే దానిపైనే మంత్రి శ్రీనివాస్ నేతృత్వంలోని కోర్‌కమిటీ దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే పది మంది వరకు అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీకి అండగా ఉంటూ వస్తున్న వీరిని మార్చే అవకాశాలు దాదాపు లేవు. సిట్టింగ్ స్థానాలైన ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ ప్రభాకర్, ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్, అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి, ఖైరతాబాద్ నుంచి చింతలరాంచంద్రారెడ్డి, గోషామహల్ నుంచి రాజాసింగ్ మళ్లీ పోటీ చేయనున్నారు. మిగిలిన స్థానాల్లో ఐదు ఇప్పటికే నిర్ణయించినప్పటికీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోనున్నారు. గ్రేటర్‌లోని బలమైన నాయకుడు లేని స్థానాల్లో అసమ్మతిలో ఉన్న పలు పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గానికో మేనిఫెస్టో సిద్ధం చేసిన బీజేపీ, కొత్త వ్యూహాలతో గ్రేటర్‌లో ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో ప్రధాన మంత్రి మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తు అన్ని కాలనీల్లో ప్రచారం మొదలు పెట్టారు. అధికార పార్టీకి ధీటుగా ఇప్పటికే ఒంటరి పోరుకు సిద్ధమంటున్న నేతలు ఎన్నికల్లో తమే విజయం సాధిస్తామని స్పష్టం చేస్తున్నారు. అధికారంలోకి రావాలంటే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని బీజేపీ నేతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి రావాలంటే పక్క రాష్ట్రాల్లో అమలు చేసిన వ్యూహాలన్నింటినీ తెలంగాణలో అమలుచేస్తున్నట్టు తెలుస్తోంది. ముందే అభ్యర్థులను ప్రకటించి సతమతమయ్యేకంటే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాక అసమ్మతి నేతలను కూడా కలుపుకుని తమ అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమౌతున్నట్టు సమాచారం. అధికారంలోకి రావాలంటే నియోజకవర్గంలో అభ్యర్థికి మంచి పట్టు ఉండాలని దానికోసం కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కమల నేతలు చెబుతున్నారు. అసమ్మతి నేతలకు నియోజకవర్గంలో పట్టు ఉంటే ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయి బీజేపీ నుంచి వారికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 
టీఆర్‌ఎస్ ఇప్పటికే 105మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడుమీద ఉన్నప్పటికీ తాము నిధానంగానే వెళ్తామని, తమకు అంత తొందర లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్‌లో మంచి పట్టు ఉన్నప్పటికీ గతంలో టీడీపీతో కలిసి పోటీ చేసి 15నియోజవర్గాలను గెలుచుకుంది. టీడీపీ మిత్రపక్షం నుంచి వైదొలగడంతో అభ్యర్థులను ప్రకటించడంలో బీజేపీ కొత్త వ్యూహాలను రచిస్తోంది. మహాకూటమితో ఏర్పడిన టీజేఎస్, సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో టికెట్ దొరకని గెలుపుగుర్రాలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది.  తెలంగాణలో జెండా ఎగురవేయాలని బీజేపీ సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా ప్రతి నియోజవర్గం నుంచి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కమిటీలను వేస్తోంది. ఇప్పటికే సర్వేలు జరిగినట్టు సమాచారం. మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు జాతీయ స్థాయిలో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో చర్చలు జరిపి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు కమల దళాలు చెబుతున్నాయి. 

Related Posts