YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నమ్మితే నమ్మండి ..లేకపోతె అది మీ ఖర్మ! నేతల మాటలతో డైలామాలో టిఆర్ఎస్ నేతలు

నమ్మితే నమ్మండి ..లేకపోతె అది మీ ఖర్మ!          నేతల మాటలతో డైలామాలో టిఆర్ఎస్ నేతలు
తెలంగాణ రాష్టంలో ముందస్తు ఎన్నికలకు అభ్యర్దులను  ప్రకటించిన విషయం విదితమే. తెరాస టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నాయుకులు తెరాస అధిష్టానంపైన తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. కొండా సురేఖ - బాబుమోహన్ వంటి వారు పార్టీని విడిచి వెళ్లిపోయారు కూడా. అయితే చివరి నిమిషం వరకూ ప్రయత్నించి భంగపడ్డ నాయకులు మాత్రం తమ అధిష్టానంపై సెగలు కక్కుతున్నారు. అంతేకాకుండా  తన నియోజకవర్గంలోని అభ్యర్దులపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. అటువంటి నాయకులను బుజ్జగించే పని కేటీఆర్ కు అప్పగించినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా కేటీఆర్ అదే పనిలో ఉన్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితీదే విజయమని - గెలుపు తర్వాత భంగపడ్డ నాయకులకు కార్పోరేషన్ - ఎమ్మెల్సీ పదవులను తాయిలాలుగా చూపించి బుజ్జగిస్తున్నారు. అయితే తాయిలాలకు లొంగని నాయకులను పట్టించుకోవద్దంటూ తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించినట్టు సమాచారం. ఈ క్రమం లోటిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలు తమ నాయకుడైన కెసీఆర్ కు అనుకూలంగా ప్రచారం చేస్తూనే - తమ నియోజకవర్గ అభ్యర్దిపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కొంతమంది అభ్యర్దులు స్వతంత్రంగా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ముక్తల్ వంటి నియోజకవర్గలలో తెరాస అభ్యర్దియైన రాంమోహన రెడ్డి మార్చాలంటూ నిన్న ఆదివారం నాడు ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయడం గమనార్హం. నియోజవర్గాలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలను ఎంత బుజ్జగించినా - వ్యతిరేక ప్రచారాన్ని ఆపకపోగా కొంతమంది నేతలు సహాయ నిరాకరణ కూడా చేస్తున్నారు. ఇటు వంటి అసమ్మతి నాయకుల కదలికలపై ఎప్పటికప్పుడు కెసీఆర్ ద్రుష్టి పెడుతున్నాట్లు సమాచారం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసమ్మతి నాయకుల గూర్చి పట్టించుకోకుండా - ఆ నియోజకవర్గాలలో గెలుపు కోసం ఎక్కువగా ద్రుష్టి పెట్టాలని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన పలు అభివ్రుద్ది కార్యక్రమాలు గడప గడపకి తీసుకుని వెళ్లాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. గతం లో కుడా ఇలాగే తాయిలాలు ప్రకటించడం తో గత నాలుగు సంవత్సరాలు నామినేటెడ్ పదవుల ఆశతో వేచిచుసి బంగా పడ్డ వారి అనీకం అని చెప్పవచ్చు .గతం లో మాదిరిగా అధినేత తాయిలాల ఆశను చూపిస్తున్నప్పటికి నేతల్లో మాత్రం నమ్మకం కుదరటం లేదు.దీనితో  చివరిసారిగా అసమ్మతి నేతలతో మరోసారి మాట్లాడాలని - అప్పటికి వినకపోతే వారి కర్మనా వారిని వదిలివేయండి అని కెసీఆర్ అన్నట్లు సమాచారం.

Related Posts