YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నెట్ లో లీకైనా టాక్సివాలా పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాతలు

నెట్ లో లీకైనా టాక్సివాలా పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాతలు
నవంబర్ లో విడుదల కానున్న  హీరో దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం ముందే లీకై నెట్ లో హల్ చల్ చేసింది. దేవరపల్లికి చెందిన ఓ ధియేటర్ యజమాని సినిమా రైట్స్ కొనే ప్రయత్నం లో ఉండగా ముందుగా లీక్ అయిన విషయం గుర్తించి పోలీసులకు ,నిర్మాతకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి  వచ్చిందని సమాచారం. పోలీసులకు  నిర్మాత లలో ఒకరైన జి.శ్రీనివాస్ కుమార్ నాయుడు (అలియాస్ ఏలూరు శ్రీను) సోమవారం ఫిర్యాదు  చేసారు.  దేవరపల్లి లో  కొందరు యువకుల మొబైల్స్ లో సినిమా  చూస్తుండగా పోలీసులుచ  పట్టుకున్నారు. సినిమా చెన్నైనుండి డబ్బింగ్ దశలోనే లీక్ అయిందని గుర్తించారు.  అసలు  లీక్ సూత్రధారులను అన్వేషించే పనిలో పోలీసులు వున్నారు. గతంలో ఇదే హీరోకి చెందిన  గీతాగోవిందం సినిమా కూడా విడుదలకు ముందే లీకైన వైనం తెలిసిందే.

Related Posts