YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

హంసలదీవిలో ఎన్టీఆర్ బయోపిక్

Highlights

 

హంసలదీవిలో ఎన్టీఆర్ బయోపిక్

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ సామ్రాట్ దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హంసలదీవి లో తీసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో ఎన్టీఆర్  ఈ ప్రాంత ప్రజలకు చేసిన కార్యక్రమాలు, తెలుగు చిత్రసీమ నుంచి ఇచ్చిన తోడ్పాటును ఈ ప్రాంతంలో చిత్రీకరించనున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం హంసలదీవి గ్రామ చివరన చిత్రీకరణకు సంబంధించిన సినీ సెట్ ను  తయారు చేస్తున్నారు.  పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సెట్టింగ్ నిర్మాణం జరుగుతుంది. ఈ నెల మూడో తేదీ నుంచి సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ నటులు బాలకృష్ణ, సుమంత్, విద్యాబాలన్, రానా దగ్గుబాటి సినిమా చిత్రం లో పాల్గొంటారని యూనిట్ సభ్యులు చెప్పారు. వారం రోజులు పాటు షూటింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related Posts