YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ వ్యూహాలతో మారుతున్న పరిణామాలు

Highlights

 

కేసీఆర్ వ్యూహాలతో మారుతున్న పరిణామాలు

మరోసారి అధికారం దక్కించుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు పోతున్న టీఆర్‌ఎస్ ప్రచారంలో దూకుడు పెంచింది. ఎన్నికల్లో టికెట్టు ఆశించి భంగపడ్డ టీఆర్‌ఎస్‌ నేతలను బుజ్జగించే కార్యక్రమం ఊపందుకొంది. టీఆర్‌ఎస్‌లో కీలకనేత, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు నియోజకవర్గాల వారీగా అసంతృప్తి నాయకులను పిలిపించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా గులాబీ శ్రేణులు పనిచేయాలని చెబుతూ అసంతృప్తి వాదులను బుజ్జగిస్తున్నారు. కలిసి పనిచేయలేకపోయినా... వ్యతిరేక శిబిరంలోకి వెళ్లకుండా ముందు చూపుతో కేటీఆర్‌ చేస్తున్న సయోధ్య పర్వం ఎంత మేర సఫలమవుతుందో చూడాల్సిందే.నాయకులు అట్టహాసంగా ఊరూవాడా కలియదిరుగుతు న్నారు. మళ్లీ గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారుస్తామని హామీలిస్తున్నారు. అయితే, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సెప్టెంబర్ 6న 105 మంది తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిం చకుండా పెండింగ్‌లో పెట్టారు. కొన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇంఛార్జిలకు టిక్కెట్లు ప్రకటించలేదు. దీంతో పలు నియోజక వర్గాల్లో ఆందోళనలు మొదలైనాయి. టిక్కెట్లు దక్కని నేతలు తమ అనుచరులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వలేమని బాహాటంగా చెప్పారు. స్వతంత్రంగా బరిలో దిగుతామని కొన్ని చోట్ల హెచ్చరించి ‘అధికార’ అభ్యర్థులకు పోటాపోటీగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. ఇటువంటి వారిని అదుపు చేసేందుకు పార్టీ పెద్దలు కేటీఆర్, కవిత, సంతోష్‌కుమార్‌తో పాటు ఆయా జిల్లాల మంత్రులు కూడా అసమ్మతి నేతలతో చర్చలు జరిపారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ, నామినెటేడ్ పోస్టు ఇస్తామని హామీలిచ్చారు. దానితో అధిష్ఠానం పంపిన దూతల హామీ మేరకు రెబెల్స్ కొంత వెనకడుగు వేసి పార్టీ నిర్ణయం ప్రకారం ముందుకు పోవాలని భావిస్తున్నారు. ఉప్పల్ నియోజక వర్గంపై టికెట్ ఆశించిన మేయర్ బొంతు రామ్మోహన్ జాబితాలో తన పేరు లేకపోవడంతో అలక వహించారు. ఆయనకు ఐదుగురు కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు. బేతి సుభాష్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని, ఆయన కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండరని తాము సహకరించమని భీష్మించారు. మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి కార్పొరేటర్లలతో మాట్లాడటంతో వారు శాంతించి అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి వెంటే ఉంటామని పేర్కొన్నారు. అదే విధంగా శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ అభ్యర్థితత్వం ప్రకటించడంపై ఆశావహులు జగదీష్ గౌడ్, రాగం నాగేందర్ వంటి నాయకులు వ్యతిరేకంగా ప్రకటనలు చేసి స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు పార్టీకి అంటిముట్టనట్లుగా వ్యవహారించారు. వెంటనే నగర మంత్రులు రంగంలోకి దిగి వారికి నచ్చజెప్పి పార్టీ లైన్‌లో నడవాలని సూచించడంతో వారు కూడా చల్లబడి అభ్యర్థికి  జై కొడుతున్నారు. కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావుకు ఇవ్వడంపై ప్రజలు హర్షించరని, ప్రజాబలమున్న నాయకులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాము బరిలో ఉంటామని కావ్య, హరీష్‌రెడ్డి పేర్కొన్నారు. వీరితో కూడ పార్టీ నాయకులు మాట్లాడి అసమ్మతి సద్దుమణిగేలా చేశారు. పటాన్‌చెరువులో గూడెం మహిపాల్‌రెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని, గాలి అనిల్‌కుమార్ అనుచరులు వ్యతిరేకత  ప్రదర్శించారు. మహిపాల్‌కు తప్ప మరో నాయకునికి ఇవ్వాలని పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించారు. జిల్లా మంత్రి హారీష్‌రావు వారికి నచ్చజెప్పి అనిల్‌కు ఎమ్మెల్సీ ఇస్తామని ఒప్పించడంతో ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. షాద్‌నగర్‌లో సిట్టింగ్ అభ్యర్థి అంజయ్యయాదవ్‌కు వ్యతిరేకంగా శంకర్, అందెల బాబయ్యలు పోటాపోటీగా సమావేశాలు జరిపి మాఇద్దరిలో ఒకరికి ఇవ్వాలని హైకమాండ్‌ను కోరారు. మంత్రి మహేందర్‌రెడ్డి వారితో ప్రత్యేక సమావేశం జరిపి పార్టీ అభ్యర్థులపై సర్వే చేయించి టికెట్లు ఇచ్చిందని, దానిలో ఎటువంటి మార్పు ఉండదని, మీరంతా ఖచ్చితంగా అభ్యర్థికి సహకరించాలని స్పష్టం చేశారు. దీంతో విధిలేక రెబెల్స్‌గా ముద్రపడ్డ నేతలంతా పార్టీ అనుకూలంగా మారిపోయారు.నల్లగొండ నియోజకవర్గం నుంచి వలస నేత కంచర్లభూపాల్‌రెడ్డికి కేటాయించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన దుబ్బాక నర్సింహ్మారెడ్డి తాను రెబెల్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఐదురోజుల పాటు అనుచరులతో హంగామా చేశారు. ఇంతలోనే మంత్రి జగదీష్‌రెడ్డి ఆయనతో చర్చలు జరిపి అభ్యర్థికి ప్రచారం చేసేలా ఒప్పించారు. మునుగోడు సీటు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఇవ్వగా, అప్పటికే తాను పోటీ చేస్తానని చెప్పిన వేనేపల్లి వెంకటేశ్వరరావు ఒక్కసారిగా మండిపడ్డారు. ఏమాత్రం ప్రజాబలంలేని వారికి ఏవిధంగా టిక్కెట్ ఇస్తారని పార్టీ పెద్దలను ప్రశ్నించారు. తనకే  టిక్కెట్ ఇవ్వాలని, నిరాకరిస్తే బరిలో ఉంటానని కరాఖండీ చెప్పారు. ఆయన పోకడలను చూసిన మంత్రి కేటిఆర్ తన వద్దకు పిలుపించుకుని పార్టీ అధినేత మాటను దిక్కరించడం సరికాదు, ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత మీకు ఆశించిన పదవి కట్టబెడుతానని హామీ ఇవ్వడంతో ఆయన మౌనంగా దాల్చారు. మిర్యాలగూడలో నల్లమోతు భాస్కర్‌రావుకు ఇవ్వడంపై నియోజకవర్గం ఇంచార్జీ అమరేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్లు, ఎంపీటీసీలతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. భాస్కర్‌రావుకు మద్ధతు ఇచ్చేదిలేదని ప్రకటించారు. రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుండటంతో జిల్లా మంత్రి చొరవ తీసుకుని సమస్యకు పుల్‌స్టాప్ పెట్టారు. అందరు కలిసి పనిచేసేలా చేశారు. పాలకుర్తిలో టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లికి ఇవ్వడంపై ఆనియోజకవర్గ ఇంచార్జీ తక్కలపల్లి రవీందర్‌రావు వ్యతిరేకించారు. తానుకూడా పోటీ చేస్తానని పేర్కొన్నారు. ఆసమ్మతి పెరగకుండా పార్టీ ఇద్దరికి మధ్య సయోద్య కుదిరించి వ్యతిరేక వర్గం లేకుండా చేసింది. స్టేషన్ ఘన్‌పూర్ రాజయ్యను అభ్యర్థిగా ప్రకటన చేయడంతో ఉపముఖ్యమంత్రి కడియం వర్గీయులు ఆయనకు ఇవ్వద్దని ధర్నాలు చేశారు. వారం రోజుల పాటు స్థానికంగా ఆందోళనలు చేశారు. మహబూబబాద్ శంకర్‌నాయక్‌కు టిక్కెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే కవిత జీర్ణించుకోలేకపోయారు. ఆయనపై అనేక ఆరోపలున్నాయని, బరిలో ఓటమి తప్పదని, ఆసీటు తనకే ఇవ్వాలని డిమాండ్ చేసి అనుచరులతో ప్రదర్శనలు నిర్వహించింది. జిల్లా పార్టీ పెద్దలు రంగంలోకి దిగి ఈసారి పార్టీకి సహాకరిస్తే నామినెటేడ్ పదవి ఆఫర్ ఇవ్వడంతో ఆమె మెటు దిగింది. మానకొండూరులో రసమయి బాలకిషన్ వ్యతిరేకంగా ఓరుగంటి ఆనంద్ పోటీ చేస్తానని పేర్కొని, క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఇంతలో ఎంపీ వినోద్‌కుమార్ చొరవతీసుకుని అందరు కలిసిపోయేలా చేసి ఐక్యత రాగం వినిపించేలా చేశారు. మంథనిలో పుట్టమధుకు ఇవ్వడంపై సునీల్‌కుమార్‌రెడ్డి వ్యతిరేకించి, మరోవర్గంగా మారడంతో పార్టీ నాయకత్వం ఆయనను ఒప్పించి పార్టీలో పనిచేసే విధంగా చేశారు. జగిత్యాల్లో డాక్టర్ సంజయ్‌కుమార్ ఇస్తే ఓడిస్తానని జితేందర్‌రావు హెచ్చరించారు. వేములవాడలో చెన్నమనేని రమేష్‌ను తప్పించి జెడ్పీ చైర్మన్ తుల ఉమకు ఇవ్వాలని పట్టుబట్టారు. కేటీఆర్ మాట్లాడంతో అందరం ఏకతాటిపైకి వచ్చారు. రామగుండంలో సోమావరపు సత్యనారాయణ ఓడిపోతాడని, కోరుకంటి చందర్‌కు ఇవ్వాలని స్థానిక నాయకులు డిమాండ్ చేశారు .కానీ ఈటల వారితో మాట్లాడి పార్టీ లైన్‌లో వెళ్లాలని సర్ధి చెప్పారు. సత్తుపల్లిలో పిడమర్తి రవి టికెట్‌పై మట్టాదయానంద్ సీరియస్‌గా ఉన్నారు. తాను బరిలో ఉంటానని హెచ్చరించారు. మంత్రి తుమ్మల సర్ధిచెప్పడంతో అందరు ఒకటైయ్యారు. పినపాక సీటు పాయం వెంకటేశ్వర్లుకు ఇవ్వడంతో వట్టం రాంబాబు వ్యతిరేకించి పోటీ చేస్తానని కుండ బ్దదలు కొట్టారు. తుమ్మల ఆయనతో చర్చలు జరిపి పోటీనుంచి తప్పుకునేలా చేశారు. దాదాపు టీఆర్‌ఎస్ అసమ్మతుల బెదడ తగ్గి, ప్రచారంలో దూసుకెళ్లుతున్నారు.మరో ఐదారుగురు ఉంటే వారిని కూడా అందుబాటులోకి తీసుకుని రాజీ కుదిరిచేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.

Related Posts