YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

ఐసీసీ డైరెక్టర్‌గా ఇంద్రా నూయీని

ఐసీసీ డైరెక్టర్‌గా ఇంద్రా నూయీని

- తొలి మహిళగా ఇంద్రా నూయీ రికార్డు

-  జూన్‌లో ఐసీసీ బోర్డు డైరెక్టర్‌ బాధ్యతలు 

-  ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్

ఇంద్రా నూయీ.. పరిచయం అక్కర్లేని పేరు. పెప్సికో చైర్మన్, సీఈవోగా ప్రపంచానికి సుపరిచితురాలామె. తాజాగా మరో పదవితో చరిత్రలో ఆ పదవి దక్కించుకున్న మహిళగా నిలిచింది. ఐసీసీ బోర్డు డైరెక్టర్‌గా ఇంద్రా నూయీని అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. తద్వారా ఐసీసీలో ఆ పదవి దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఐసీసీ బోర్డు ఏకగ్రీవంగా ఆమెను డైరెక్టర్‌గా ఎన్నుకుంది. ఈ ఏడాది జూన్‌లో ఆమె ఆ బాధ్యతలు చేపడతారు. క్రికెట్‌లో అంతర్జాతీయ పాలనా భాగస్వామ్యాన్ని పెంచాలన్న నిర్ణయం, అనేక విధానపర మార్పులకు ఉపక్రమించిన ఐసీసీ.. అందులో భాగంగానే ఇంద్రా నూయీని స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది. ఇక, ప్రపంచ శక్తిమంతమైన మహిళల జాబితాలో ఫార్చూన్ మేగజీన్ ఆమెను చేర్చింది. కాగా, ఆమె రాక తమకు ఎంతో సంతోషాన్నిచ్చేదని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ అన్నారు. బోర్డులో ఓ స్వతంత్ర డైరెక్టర్, అందునా ఓ మహిళా డైరెక్టర్ చేరిక ద్వారా మండలి పాలన మరింత మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

క్రికెట్ అంటే మక్కువే..

క్రికెట్ అంటే తనకు అమితమైన ఇష్టమని, చదువుకునే రోజుల్లో క్రికెట్ ఆడేదాన్నని, ఇప్పుడూ క్రికెట్ అంటే మక్కువేనని ఇంద్రా నూయీ చెప్పారు. ఓ బృందంలా కలిసి పనిచేయడం, సమగ్రత, గౌరవం, ఆరోగ్యకరమైన పోటీ వంటి వాటిని క్రికెట్ నుంచే నేర్చుకున్నానని చెప్పారు. ఐసీసీ తొలి మహిళా డైరెక్టర్‌గా చేరబోతుండడం ఎంతో ఉత్సాహాన్నిస్తోందని చెప్పారు. బోర్డు సభ్యులతో అన్ని విషయాల్లో సమగ్రంగా పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని అన్నారు. కాగా, స్వతంత్ర డైరెక్టర్‌గా ఆమె రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఆ పదవీకాలాన్ని మరో రెండేళ్లు పెంచే వెసులుబాటు కూడా ఉంది. పెంచిన రెండేళ్లు సహా మొత్తంగా ఆరేళ్ల పాటు ఆమె పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. 

Related Posts