YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

భారీ అంచనాలతో 'సాహో'

భారీ అంచనాలతో 'సాహో'
బాహుబలితో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్‌తో యువి క్రియేషన్స్‌ సంస్థ 'రన్‌ రాజా రన్‌' ఫేం సుజిత్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో 200 కోట్ల భారీ బడ్జెట్‌తో 'సాహో' చిత్రాన్ని హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ప్రభాస్‌ లుక్స్‌ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను నెలకొనేలా చేశాయి. ప్రభాస్‌ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా మేకింగ్‌ కోసం నిర్మాతలు ఎక్కడా తగ్గడం లేదు. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మందిరా బేడి, ఎవ్‌లిన్‌ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ వంటి బాలీవుడ్‌ తారలు నటిస్తుం డటం విశేషం. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ కోసం హాలీవుడ్‌ స్టంట్‌మాస్ట ర్స్‌తో పాటు బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ పనిచేస్తున్నారు. ఈ సినిమా మేకింగ్‌ వీడియోను ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం కోసం ఇటు అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
మరో భారీ చిత్రానికి శ్రీకారం..! 
'సాహో' సెట్స్‌లో ఉండగానే ప్రభాస్‌ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందే మరో భారీ బడ్జెట్‌ చిత్రం షూటింగ్‌లో పాల్గొని ఆశ్చర్యానికి గురి చేశారు. 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శక త్వంలో ఇటలీలో షూటింగ్‌ ప్రారంభమైంది. యూరప్‌లో అత్యధిక భాగం షూటింగ్‌ జరుపుకోబోతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. ఈ చిత్రానికి కూడా హాలీవుడ్‌ టెక్నీషి యన్స్‌ పనిచేస్తున్నారు. ప్రభాస్‌ చేసే సినిమాలన్నీ దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు బాలీవుడ్‌లో కూడా నిర్మాణం జరుపుకుంటున్నాయి. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్‌ ఆడియెన్స్‌లో కూడా ప్రభాస్‌ ఇమేజ్‌ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా 'డార్లింగ్‌' అంటూ పలకరించే యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Related Posts