YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్న జగన్‌ అందులోని బాగామే‘వైకాపా కోడి కత్తి డ్రామా!:: మంత్రి నారా లోకేశ్‌

పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్న జగన్‌ అందులోని బాగామే‘వైకాపా కోడి కత్తి డ్రామా!:: మంత్రి నారా లోకేశ్‌

జగన్‌ పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. జగన్‌పై దాడి గురించి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ‘జగన్ మోదీ రెడ్డి’కి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామాకి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది. ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చర్యం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే’ అంటూ ‘జగన్నాటకం’  అనే హ్యాష్‌ట్యాగ్‌ను లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై గురువారం ఓ యువకుడు కత్తితో దాడికి దిగిన సంగతి తెలిసిందే. అనంతరం జగన్‌ హైదరాబాద్‌ చేరుకుని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చేరారు. జగన్‌కు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. జగన్‌ సీఎం అయ్యేందుకు అవకాశాలు మెరుగు పడతాయని, ఆయనకు సానుభూతి వస్తుందని.. జగన్‌కు అది ఉపయోగపడుతుందనే తాను దాడి చేసినట్టు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పారు.

Related Posts