YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మహాకుటమిలోనైన బిసి లకు 65 టికెట్లు ఇవ్వండి: బిసి సంఘాల విజ్ఞప్తి

మహాకుటమిలోనైన బిసి లకు  65 టికెట్లు ఇవ్వండి: బిసి సంఘాల విజ్ఞప్తి

;అసెంబ్లీ-పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ – అధ్వర్యంలోని మహాకుటమి బిసి లకు  65 టికెట్లు ఇవ్వాలని. నేడు జరిగిన బి.సి సంఘాల సమీక్ష సమావేశం డిమాండ్ చేసింది. నేడు బి.సి భవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించవలిసిన వ్యూహం పై చర్చించారు.  మహాకూటమి పేరుమీద బిసి లకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తే సహించేది వారు లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ లీక్  చేస్తున్న పేర్లలో కూడా బి.సి ల పేర్లు తక్కువగా కన్పిస్తున్నాయి.ఇటివల రాహుల్ గాంధీ  హైదరాబాదు పర్యటన సందర్భంగా బి.సి నేత ఆర్.కృష్ణయ్య తో జరిపిన చర్చలతో ప్రతి పార్లమెంట్  నియోజక వర్గంలో కనీసం రెండు సీట్లు కేటాయిస్తామని 119 లో 40 సీట్లు బి.సి లకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ స్థానిక బి.సి నాయకులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు కన్పించడం లేదు. గెలుపు గుర్రాల పేరు మీద బి.సి లకు అన్యాయం చేయ తలపెడితే సహించేది లేదని బి.సి నాయకులు హెచ్చరించారు. అలాగే బిజేపి పార్టీ ఇటివల ప్రకటించిన సీట్లలో బి.సిలకు చాల తక్కువ కేవలం 8 సీట్లు మాత్రమే కేటాయించారు. ఒక వైపు దేశ ప్రధాన మంత్రి బిసి - అలాగే ఒక వైపు బిజేపి అద్యక్షులు బిసి అయివుండి కుడా బి.సి లకు తక్కువ సీట్లు కేటాయించడం అన్యాయమన్నారు. ఇప్పటివరకు 38 సీట్లు కేటాయించారు. ఇక ముందు కేటాయించబోయే 81 సీట్లలో బి.సిలకు మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు వచ్చే విధంగా చూడాలని బిసినేతలు కోరారు.

Related Posts