YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఐదొందల కోట్లకు చేరిన 2.0 బడ్జెట్

ఐదొందల కోట్లకు చేరిన 2.0 బడ్జెట్

సూపర్‌స్టార్ రజనీకాంత్ -- శంకర్ కాంబినేషన్ మూవీ 2.ఓ (రోబో 2) నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 3న ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నారు. 2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా..  ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రచారం సాగుతోంది. దాదాపు 500 కోట్లు పైగా బడ్జెట్ వెచ్చించారని మరో ప్రచారం హోరెత్తిపోతోంది. అయితే బడ్జెట్ విషయంలో నిజం ఎంత? అంటే  ప్రఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్స్‌కి చెందిన ప్రముఖ వెబ్‌సైట్ ఓ కథనం ప్రచురించింది.2.ఓ భారీ బడ్జెట్ సినిమానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అంతటా ప్రచారం సాగుతున్నట్టు 500కోట్లు ఖర్చు అవ్వలేదు. ఈ సినిమాకి ఓవరాల్‌గా 400కోట్ల బడ్జెట్ ఖర్చయింది. అది కూడా ఓసారి వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఫెయిల్ అయ్యాక, రెండోసారి పని చేయించాక మదింపు వేసిన బడ్జెట్ ఇది. ఈ మొత్తాన్ని లైకా సంస్థ రికవరీ చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. అలానే ఈ సినిమా కంటెంట్ పరంగానూ హై స్టాండార్డ్స్‌లో ఉందని క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది.సౌతిండియాలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి ఉన్న మార్కెట్, ఇమేజ్ దృష్ట్యా బడ్జెట్ రికవరీ సాధ్యమే. అయితే రజనీకి ఉత్తరాదిన మాత్రం మార్కెట్ ఏమంత లేదు. అక్షయ్ కుమార్ ఇమేజ్ బాలీవుడ్‌లో బిజినెస్ పరంగా కలిసొస్తోంది. ఇప్పటికే 2.ఓ శాటిలైట్ పరంగా 80 కోట్లు వసూలు చేసింది. తెలుగు రైట్స్, తమిళ్ రైట్స్, హిందీ రైట్స్ పరంగా బడ్జెట్ ని చాలా వరకూ రికవరీ చేస్తుందని ఆ కథనం వెల్లడించింది.

Related Posts