YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

హైకోర్టును ఆశ్రయించిన హీరో అర్జున్..!!

హైకోర్టును ఆశ్రయించిన హీరో అర్జున్..!!

 యాక్షన్ కింగ్, హీరో అర్జున్ కర్ణాటక హైకోర్టును  ఆశ్రయించారు. అర్జున్ గత 37 సంవత్సరాలుగా 150 సినిమాల్లో నటించారని తెలిపారు. అర్జున్‌ హనుమాన్‌ భక్తుడని, చెన్నైలో 32 అడుగుల పొడవు, 17 అడుగుల వెడల్పు ఉన్న ఆంజనేయుడి విగ్రహాన్ని నిర్మించారని వెల్లడించారు. శ్రుతి కేసుతో అర్జున్ కుటుంబం ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తోందనీ, వెంటనే ఈ కేసును కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రుతి హరిహరన్ అర్జున్  పై నిరాధార ఆరోపణలు చేసిందని తెలిపారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు అబద్ధాలన్నారు. మరోవైపు నటి శ్రుతిపై అర్జున్ దాఖలు చేసిన రూ.5 కోట్ల పరువునష్టం దావా కేసులో నిన్న వాదనలు ముగిశాయి. ఈ కేసులో మరికొంత సమయం కావాలని కోరడంతో న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేశారు. Learnmore

Related Posts