YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మోత్కుపల్లి పై దాడికి ధర్నా

మోత్కుపల్లి పై దాడికి  ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు యాదగిరిగుట్ట. తుర్కపల్లి. రాజపేట్ మండలాలకు చెందిన  బిఎల్ఎఫ్ నాయకులు ఆలేరు  జాతీయ రహదారిపై బైఠాయించి మోత్కుపల్లిపై దాడి చేసిన బూడిద భిక్షమయ్యగౌడ్ ను వెంటనే అరెస్టు చేయాలని బిఎల్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంత నచ్చచెప్పిన వినకపోవడంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఒక దళిత నాయకుడు పై దాడి చేపించిన బిక్షమయ్య గౌడును అరెస్టు చేసేది పోయే మమ్మల్ని అరెస్టు చేయడం ఏంటి అని బిఎల్ఎఫ్ నాయకులు పోలీస్ జులుం నశించాలని జాతీయ రహదారిపై నినాదాలు చేశారు ఇప్పటికైనా బూడిద భిక్షమయ్యగౌడ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు.  ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని బిఎల్ఎఫ్ నాయకులు హెచ్చరించారు.

Related Posts