YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గజ్వేల్‌లో కేసీ ఆర్‌ను ఓడించాలని హరీశ్‌ తనను కోరాడు కాంగ్రెస్‌ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు అవినీతి సొమ్ము తనకు వద్దని తిరస్కరించా

గజ్వేల్‌లో కేసీ ఆర్‌ను ఓడించాలని హరీశ్‌ తనను కోరాడు     కాంగ్రెస్‌ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు          అవినీతి సొమ్ము తనకు వద్దని తిరస్కరించా

మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్‌ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా తన మామ, సీఎం కేసీఆర్‌ను గజ్వేల్‌లో ఓడించాలని హరీశ్‌ తనను కోరినట్లు ఆయన వెల్లడించారు. ఓ ప్రైవేట్‌ నెంబర్‌ నుంచి హరీశ్‌రావు నిన్న తనకు ఫోన్‌ చేశారని.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలని, అవసరమైన ఆర్థియ సాయం అందిస్తానని ఆయన తనతో అన్నట్టు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని బాధ్యతలను కేటీఆర్‌కే అప్పగిస్తూ కేసీఆర్‌ తన ఇజ్జత్ తీస్తున్నారని, ఆయన వైఖరితో రాజకీయ జీవితం లేకుండా పోతోందని హరీశ్‌ చెప్పినట్లు ప్రతాప్‌ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కలిసి పనిచేద్దామన్నారని వివరించారు. ఆర్థికసాయం అందిస్తానని హరీశ్‌ చెప్పారని.. అవినీతి సొమ్ము తనకు వద్దని తిరస్కరించానన్నారు. తనకు గజ్వేల్‌ ప్రజలు, యువత అండగా ఉన్నారని, కేసీఆర్‌ కుటుంబం మొత్తం వచ్చి ప్రచారం చేసినా విజయం తనదేనని ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ప్రతాప్‌ రెడ్డి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఏ దేవుడిపైనైనా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
 

Related Posts