YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎస్టి,ఎస్టి, అట్రాసిటి యాక్ట్ మాదిరిగా బి.సి యాక్టును తీసుకురావాలి 4 న హైదరాబాదులో సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ

ఎస్టి,ఎస్టి, అట్రాసిటి యాక్ట్ మాదిరిగా బి.సి యాక్టును తీసుకురావాలి 4 న హైదరాబాదులో సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ

పార్లమెంటు లో బి.సి బిల్లు పెట్టి చట్ట సభలలో బి.సిలకు 50 % రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4 న హైదరాబాదులో సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని జాతీయ బి,సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య, తెలంగాణా బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఎర్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం బిసి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రభాబును, మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్ ను, కేంద్ర మంత్రులను, కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీ అద్యక్షులు ఎల్.రమణ ను, సిపిఐ చాడ వెంకట్ రెడ్డిని, తెలంగాణ జన సమితి అద్యక్షులు కోదండరామ్ ను ఆహ్వానించినట్లు తెలిపారు. పార్లమెంట్ లో బి.సి బిల్లు పెట్టి బి.సి లకు చట్టసభలలో అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని,పంచాయత్ రాజ్, మున్సిపల్ సంస్థల ఎన్నికలలో బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుండి 50 శాతం వరకు పెంచాలని,ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్దత కల్పించాలని,బి.సి లకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించాలి. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని,ఎస్టి,ఎస్టి, అట్రాసిటి యాక్ట్ మాదిరిగా బి.సి యాక్టును తీసుకురావాలని,20 వేల కోట్లతో బి.సి లకు సబ్ – ప్లాన్ ఏర్పాటు చేయాలి. ప్రతి కుటుంబానికి 5 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణం మంజురుచేయాలి. 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని,తొలగించిన 26 కులాలను వెంటనే బి.సి జాబితాలో కలుపాలని,రాష్ట్రంలో విద్యా, ఉద్యోగాలలో బి.సి రిజర్వేషన్లను రాష్ట్రంలో 25 నుండి 50 శాతంకు పెంచాలి. కేంద్రంలో 27 శాతం 50 శాతంకు పెంచాలన్న ప్రధాన డిమాండ్స్ తో ఈ మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ బహిరంగ సభకు యాదవ సంఘం, గౌడ సంఘం, మున్నూరు కాపు సంఘం, ముదిరాజ్ సంఘం, తెలంగాణా పద్మశాలి ఐఖ్యవేదిక, రజక సంఘం, విశ్వ బ్రహ్మణ సంఘం, కుమ్మరి సంఘం, మేర సంఘం, నాయి బ్రహ్మణ సంఘం, ఉప్పర సంఘం, మేడార సంఘం, వడ్డెర సంఘం లతో పాటు మొత్తం 112 బి.సి కుల సంఘాలు మద్దతు తెలిపాయి. 
 

Related Posts