YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాయ్ రాజా కాయ్

కాయ్ రాజా కాయ్

 తెలంగాణలో ఎన్నికల వేళ అభ్యర్ధుల గెలుపోటములపై బెట్టింగ్ లో జోరుగా సాగుతున్నాయి...ఇప్పటికీ కూటమిలో పొత్తుల పంచాయతీ తేలకున్నా గ్రామాల్లో మాత్రం ఏ పార్టీ తరపున ఎవరు పోటి చేస్తాం విజయం ఎవరిని వరిస్తుందో బెట్టింగ్ బాబులు జేబులకు చిల్లులు పెట్టుకునేందుకు తహతహలాడుతున్నారు..ఇటీవల తెలంగాణలోని ఓ నియోజకవర్గం గెలుపోటములపై సాగుతున్న బెట్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావటంతో తెలంగాణ ఎన్నికలలో బెట్టింగ్ పై పోలీసులు దృష్టి సారించారు.
ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ లకే పరిమితమైన బెట్టింగ్ ఇపుడు ప్రతి దాంట్లో దూరిపోయింది. అసేంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో నేతల గెలుపోటములపై బెట్టింగ్ జోరుగా నడుస్తుంది..మహాకూటమి నుంచి అభ్యర్ధులను ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్ బాబులు పందాలు కడుతున్నారు. ఎన్నికల బెట్టింగ్ కేవలం గ్రామాలకే పరిమితం కాలేదు..నియోజకవర్గ కేంద్రాల్లోనే ఈ బెట్టింగ్ రాయుళ్లు హల్ చల్ చేస్తున్నారు. సాధారణంగా అభ్యర్ధులు ఇద్దరు సమర్ధులై విజయం నీదా, నాదా అనే సమయంలో బెట్టింగ్ లు కట్టడం చూస్తుంటాం..కానీ ఇప్పుడు మాత్రం అభ్యర్ధిలుతో సంభందం లేకుండా పార్టీల గెలుపోటములపై కూడా  బెట్టింగ్ కడుతున్నారు..అభ్యర్ధి గెలుపు, సాధించే మెజారిటీలపై కూడా పందాలు కడుతూ జేబులు ఖాళీ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.. ప్రస్తుతానికి వేలల్లో ఉన్న పందాలు ప్రజాకూటమి అభ్యర్ధుల  ఖరారు తరువాత లక్షల్లోకి వెళతాయనే ప్రచారం సాగుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్
నాయకుల మధ్య బెట్టింగుల నడుతస్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం పోలీసుల దృష్టికి పోవడంతో బెట్టింగ్ లు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు..బెట్టింగ్ పాల్పడిన ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, సిద్ధిపేట నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిది అన్న అంశం పై బెట్టింగులు జోరుగా  సాగుతున్నాయి ఈ బెట్టింగ్ లు కేవలం తెలంగాణ జిల్లాలకే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్ లోని సరిహద్దు గోదావరి జిల్లాల్లో కూడా జోరుగా సాగుతుంది. కొనసీమ కొబ్బరి తోటల్లో తెలంగాణ ఎన్నికల పై జోరుగా బెట్టింగ్ సాగుతుందనే ప్రచారం కూడా ఉంది..
ఎన్నికలే అదునుగా భావించిన బెట్టింగ్ ముఠాలు అయాకులను ఉసిగొల్పుతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు ఆశ చూపి బెట్టింగ్ లోకి దింపుతున్నారు..ఈజీ మనీకి అలవాటు పడిన యువకులు ఈ బెట్టింగ్ వైపు ఎక్కువగా మొగ్గుచూపి జేబులు గుల్ల చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో కొద్దిమంది అప్పులు చేసి మరి ఈ బెట్టింగ్ కు పాల్పడేందుకు సిద్ధమవుతున్నారు..ఈ బెట్టింగ్ లతో సర్వం కోల్పోయే ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం కూడా పొంచి ఉండటంతో పోలీసులు దీనిపై దృష్టి సారించి ఎన్నికలపై జరుగుతున్న బెట్టింగ్ లను నివారించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

Related Posts