YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గ్రేటర్ వ్యూహం

గ్రేటర్ వ్యూహం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పై భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌ట్టు సాదించేందుకు వ్యూహ‌త్మ‌కంగా అడుగులు వేస్తుంది.ఆచితూచి టిక్కెట్లను ప్రకటిస్తూ ముందుకెళ్తోంది.
ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన స్థానాల‌పై ఏకాభిప్రాయం సాధిస్తూ ముందుకు క‌దులుతుంది బీజేపీ.ఇప్ప‌టి వ‌రుకు మ‌హ‌న‌గ‌రంలో బీజేపీ ప్ర‌క‌టించిన,ప్ర‌క‌టించాల్సిన స్థానాల‌పై స్పెష‌ల్ స్టోరీ.
భారతీయ జ‌న‌తా పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌టించిన రెండు జాబితాలో 66 స్థానాలు ప్ర‌క‌టిస్తే దానిలో గ్రేట‌ర్‌లోనే 18 స్థానాలు అభ్య‌ర్ధ‌లు ప్ర‌క‌టించింది. మొదటి విడతలో 10 స్థానాలకు అభ్యర్థులను
ప్రకటించగా.. రెండో జాబితాలో మరో 8 మంది పేర్లను వెల్లడించింది. ఇప్పటికే ఈ స్థానాలపై ఏకాభిప్రాయం సాధించింది బీజేపీ. గ్రేటర్ పరిధిలోని 27 స్థానాల్లో మరో తొమ్మిదింటికి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుత జాబితా విషయానికి వస్తే.. పాతబస్తీపై కమలనాథులు ప్రత్యేక దృష్టి సారించారనే చెప్పాలి. అక్కడ మొదటి నుంచి మజ్లిస్‌ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలకే టికెట్లను కేటాయించింది.
గ్రేట‌ర్ నుండి బీజేపీ తొలి జాబితా అభ్యర్థుల వివరాలు ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్, అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి, ఉప్పల్‌ ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, ఖైరతాబాద్‌లో చింతల రామచంద్రారెడ్డి, మేడ్చల్‌లో మోహన్‌రెడ్డి, షాద్‌నగర్‌ శ్రీవర్ధన్ రెడ్డి, ఎల్బీనగర్‌ పేరాల చంద్రశేఖర్‌రావు, మల్కాజ్‌గిరి రామచంద్రరావు, గోషామహల్‌ రాజాసింగ్, ప్ర‌క‌టించ‌గా రెండ‌వ జాబితాలో రాజేంద్రనగర్ నుంచి బద్దం బాల్ రెడ్డి, మలక్‌పేట్ నుంచి ఆలే జితేంద్ర, కూకట్‌పల్లి- మాధవరం కాంతారావు,శేరిలింగంపల్లి- యోగానంద్,  చార్మినార్ నుంచి ఉమా మహేందర్, చాంద్రాయణగుట్ట- సయ్యద్ షెహజాది, యాకుత్‌పుర-చార్మాని రూప్‌రాజ్, బహదూర్‌పుర- హనీఫ్ అలీ పేర్ల‌ని ప్ర‌క‌టించి వ్యూహ‌త్మ‌కంగా అడుగులు వేస్తుంది.ఇంకా న‌గ‌రంలో ప్ర‌క‌టించాల్సిన స్థానాలు న‌గ‌రంలో జూభ్లీహిల్స్‌, స‌న‌త‌న‌గ‌ర్‌, కుత్బులాపూర్‌,
నాంప‌ల్లి, కార్వాన్ త‌దిత‌ర నియేజ‌క వ‌ర్గాల అభ్య‌ర్ధుల‌ని ప్ర‌క‌టించాల్సి ఉంది.
పాతబస్తీ నుంచి పలువురు సీనియర్లను బీజేపీ రంగంలోకి దించింది. మొదటి నుంచి మజ్లిస్‌కు వ్యతిరేకంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి దివంగత ఆలె నరేంద్ర కుమారుడు జితేంద్రకు మలక్‌పేట నియోజకవర్గాన్ని ఖరారు చేసింది.. చాంద్రాయణగుట్ట నుంచి సయ్యద్‌ షాహజాది, చార్మినార్‌-టి.ఉమా మహేంద్ర, యాకుత్‌పురా-చర్మాని రూప్‌రాజ్‌, బహదూర్‌పుర నుంచి హనీఫ్‌ అలీలకు టికెట్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి బద్దం బాల్‌రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి జి.యోగానంద్‌, మేడ్చల్‌ జిల్లా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి మాధవరం కాంతారావుకు పార్టీ అధిష్టానం టికెట్లను ఖరారు చేసింది.
మ‌రో వైపు కార్వాన్‌లో మజ్లిస్‌ పార్టీపై మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బద్దం బాల్‌రెడ్డి పలుమార్లు హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. రాజేంద్రనగర్‌లో హిందువుల ఓట్లతో పాటు ఉత్తరాదివారిని ఆకట్టుకునేందుకు భాజపా దృష్టిసారించి ఈసారి అక్కడినుంచి ఆయనను బరిలోకి దించుతోంది. చతుర్ముఖ పోటీలో విజయం సాధించే అవకాశం ఉందనే అభిప్రాయంతో ఈ ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో పోటీ చేసిన అనుభవం, మేడ్చల్‌ జిల్లా భాజపా అధ్యక్షులుగా వ్యవహరిస్తుండటంతో మాధవరం కాంతారావుకు కూకట్‌పల్లి నుంచి రంగంలోకి దించుతుంది...రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిగా.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు, సంబంధాలు ఉన్నాయనే ఉద్దేశంతో జి.యోగానంద్‌కు పార్టీ టికెట్‌ను కేటాయించినట్లు సమాచారం.
మలక్‌పేట నియోజకవర్గంలో స్థానికేతరులకు సీటు కేటాయించారంటూ స్థానిక నాయకులు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ కన్వీనర్‌ సంరెడ్డి సురేందర్‌రెడ్డి నివాసానికి చేరుకుని మద్దతు పలికారు. పార్టీ పెద్దలు సర్దిచెప్పడంతో అసమ్మతి సద్దుమణిగింది. అలాగే శేరిలింగంపల్లి నుంచి సీటు ఆశించిన భాజపా అధికార ప్రతినిధి కె.నరేష్‌, కసిరెడ్డి భాస్కరెడ్డి దీక్షలకు దిగినా అధినాయకత్వం వెంటనే రంగంలోకి దిగి అక్కడి అభ్యర్థి యోగానంద్‌కు వ్యతిరేకత లేకుండా జాగ్రత్త పడింది. ఇక్కడ దీక్షిన దిగిన నాయకులకు బీజేపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామచంద్రరావు నిమ్మరసం ఇచ్చి
విరమింపజేశారు.ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌టించిన 66 స్థానాలు మిన‌హ మిగిలిన  53 స్థానలతో కూడిన చివ‌రి జాబితాను దీపావళి తర్వాత ప్రకటిస్తామని బీజేపీ వ‌ర్గాలు చెప్తున్నాయి.

Related Posts