YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

9న కూటమి జాబితా..? కొలిక్కి వచ్చిన లెక్కలు

9న కూటమి జాబితా..? కొలిక్కి వచ్చిన లెక్కలు

కూటమిలో సీట్ల సర్దు బాటు కొలిక్కి వచ్చింది. 9వ తేదీన కూటమి జాబితాను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.  కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీ నేతలు దశలవారీగా జరిపిన చర్చల్లో చివరగా సామ రస్యపూర్వక అవగాహన ఏర్పడిం దని కాంగ్రెస్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. మిత్రపక్షాలకు 24 స్ధానాలను కేటాయించాలనే నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదంటున్నారు. టీడీపీకి కేటాయించే స్ధానాల విషయంలో స్పష్టత వచ్చిందని, టీజేఎస్, సీపీఐ పోటీ చేసే నియోజకవర్గాల గుర్తింపు ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుందని పేర్కొం టున్నారు.  కోదాడ నియోజక వర్గం నుంచి టీడీపీ పోటీ చేయాలని భావించడంతో ఆ స్ధానం నుండి ప్రాతినిథ్యం వహి స్తున్న ఎన్. పద్మావతి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరిం చుకున్నారు. అదే విధంగా మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడానికి ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ ఈ స్ధానం మరో మిత్ర పక్షానికి కేటాయించే అవకాశం ఉందంటున్నారు. నిర్దిష్ట ప్రమాణాల మేరకు అభ్యర్ధులను గుర్తించడం జరుగుతుందన్నారు. సర్వేలను ప్రామాణికంగా తీసుకోవడంతో పాటుగా పార్టీలు, అభ్యర్దుల బలం, బలహీనతలు, ఎదుటి పక్షం నుంచి ఏర్పడే పోటీ తీవ్రతను పరిగణనలోకి తీసుకోవడంతో అభ్యర్ధుల గుర్తింపు, కూటమి పక్షాల మధ్య సీట్ల పంపిణీలో కొంత జాప్యం జరిగిందంటున్నారు.  టీడీపీ పక్షాన జూబ్లీహిల్స్ నియోజక వర్గం నుంచి హరికృష్ణ కుమారుడు కళ్యాణ్‌రామ్‌ను ఎన్నికల బరిలోకి దింపే అవకాశం లేకపోలేదంటు న్నారు. తెలుగుదేశం పార్టీతో పాటుగా టీజేఎస్. సీపీఐ నాయకులు ఎల్. రమణ, చాడా వెంకట్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం నగర శివారులోని ఒక రిసార్టులో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలను చర్చించా రు. గెలుపోటములను బేరీజు వేసుకొని ముందుకు సాగాలనే అభిప్రాయంతో అన్ని పక్షాలు ఏకాభిప్రాయం తెలియజేశాయంటున్నారు. సంఖ్య ముఖ్యం కాదని, గెలుపు ప్రధానమనే ఆలోచనతో ముందుకు సాగవలసి ఉందనే కాంగ్రెస్ ఆలోచనతోనే ముందుకు సాగేందుకు కూటమి పక్షాలు అంగీకారానికి వచ్చాయని తెలిసింది. ఉప్పల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సత్తుపల్లి, ఖమ్మం, దేవరకద్ర, మక్తల్, అశ్వరావుపేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, కోదాడ, బాల్కొండతో పాటుగా మహబూబ్‌నగర్ లేదా జడ్చర్లలో ఏదో ఒక నియోజక వర్గం నుండి టీడీపీ పోటీ చేసే విధంగా అవగాహన కుదిరిందంటున్నారు. కోదాడ నుంచి పద్మావతి పోటీ నుండి
తప్పుకుంటున్నందున మునుగోడు నుండి ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను బరిలోకి దింపే విషయం కూడా తెరపైకి వచ్చింది. ఆయన నకిరేకల్, మునుగోడులో ఏదో ఒక స్ధానం
ఆశిస్తున్నాడు. నకిరేకల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా చిరుమర్తి లింగయ్యను రంగంలోకి దింపాలని భావిస్తున్నందున మునుగోడు ను సుధాకర్‌కు కేటాయించే విషయం పరిశీలనలో ఉందంటున్నారు. ఈ స్ధానం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా ఇప్పటికే కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి బరిలోకి దిగారు. సీసీఐ కూడా మునుగోడు స్దానాన్ని కోరుకుంటుంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శాసనమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కోరుకున్న పక్షంలో పార్లమెం టుకు పంపించే విషయం పరిశీలించడం జరుగుతుందని సీనియర్లు పేర్కొన్నారు. మొత్తంగా 17 స్దానాలు డిమాండ్ చేసిన టీజేఎస్ చివరికి 14 నుండి 15 స్దానాలతో సర్దుకోవలసి వస్తుంది. అదే విధంగా సీపీఐ 4 నుండి 5 సీట్లకు పరిమితం కాబోతుంది. కాంగ్రెస్ 95 స్ధానాలు, టీడీపీ 14 స్ధానాలు దాదాపు ఖరారైనట్లేనని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. కోదండరాం ప్రాతినిథ్యంపైన కాంగ్రెస్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. కోదండరాంను ఏదో ఒక నియోజక వర్గానికి పరిమితం చేయడం సహేతుకం కాదని అంటున్నారు. అత్యధికులైన కాంగ్రెస్ సీనియర్లు కోదండరాంను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం కంటే కూడా ఎన్నికల ప్రచారంలో రాష్ట్రమంతటా విస్తృతంగా తిప్పడం ఉత్తమం అంటున్నారు. కూటమిలోని అన్ని పక్షాల అభ్యర్దుల గెలుపు కోసం కోదండరాం ప్రచారం నిర్వహించ డంతో పాటుగా ఎన్నికల అనంతరం ఆయన పట్ల గౌరవ సూచకంగా పెద్దల సభ రాజ్యసభకు పంపించడం ఉత్తమం అనే వాదన నానాటికి బలపడుతుంది. దేశ రాజకీయాల్లో  కోదండరాం ఆవశ్యకతను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే ఆలోచనలో ఉందని అంటున్నారు. టీజేఎస్ పక్షాన పోటీ చేసే వారినంద రినీ గెలిపించుకోవడంతో ఆయన పట్ల గౌరవాన్ని చాటాలని కాంగ్రె స్ శ్రేణులను కోరాలనే ఆలోచన కాంగ్రెస్ పెద్దల్లో ఉందంటున్నారు.కూటమి కలిసే ఉంటుంది. సీట్లు, అభ్యర్దుల ఎంపిక సర్వే ప్రకా రమే జరుగుతుంది, సంఖ్య ముఖ్యం కాదని గెలుపే లక్ష్యం కావాలనే ఆలోచనతో కసరత్తు జరుగుతున్నందున జాబితాను రూపొందించడం, సీట్లను పంచుకోవడంలో కొంత ఆలస్యం జరుగు తుంది. రాబోయే రోజుల్లో కూడా కూటమిగానే ముందుకు సాగడం లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తుంది. కూటమి పక్షాల్లో కొంత అసహనం వ్యక్తమయిన తీరును కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంది. అందుకే శనివారం ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూటమి నేతలతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. అభ్యర్దులను ప్రకటించిన తర్వాత ఉత్పన్నమయ్యే పరిణామాల గురించి కూడా మాట్లాడినట్లు తెలిసింది.

Related Posts