YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

23న 24 కిస్సెస్...

23న 24 కిస్సెస్...

నువ్వే నా బాయ్ ఫ్రెండ్.. నీతోనే నా ఫస్ట్ కిస్.. నీతోనే అన్నీ అంటూ రాజ్ తరుణ్‌‌కి హాల్స్ అవసరం లేకుండా కిస్సులో ఉన్న ఒరిజినల్ ఫ్లేవర్‌ని అందించి ‘కుమారి 21F’ చిత్రంతో సన్సేషన్
హిట్ కొట్టింది బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్. తాజాగా తనకు కలిసొచ్చిన ఉన్న కిస్‌నే కాన్సెప్ట్‌గా మలిచి ‘24 కిస్సెస్’ అంటూ మరోసారి ముద్దుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల విడదలైన ఈ చిత్రం
టీజర్, ట్రైలర్‌లకు కిస్ లవర్స్ నుండి మంచి స్పందన రావడంతో తాజాగా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాను నవంబర్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ లెక్కన ఈ నెల 23న కుమరి 24 ముద్దులతో సందడి చేయనున్నదన్నమాట. ‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్న శీర్షికతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించారు. సిల్లీమొంక్స్
ఎంటర్‌టైన్మెంట్, రెస్పెక్ట్ క్రియేషన్స్ పతాకాలపై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జోయ్‌ బారువా స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాలో
రావు రమేష్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Related Posts