YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘సర్కార్’

వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘సర్కార్’

తమిళ నటుడు, ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం సర్కార్ బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. మంగళవారం విడుదలైన ఈ సినిమా ఒక్క రోజులోనే భారీ వసూళ్లతో రికార్డు సృష్టిస్తోంది. చెన్నైలో 70 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా ఒక్క రోజులోనే రూ. 2.41 కోట్లు వసూలు చేసింది. ఇక, ఓవర్సీస్‌లో అయితే చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల సునామీతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు రూ. 2.32 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సినిమా పట్ల కొంత నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ వసూళ్లపై ఆ ప్రభావం కనిపించకపోవడం విశేషం.

Related Posts