YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
ఈ నెల పన్నెండు నుంచి పంతొమ్మిది వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చని జీహెచ్ ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. నగర పరిధిలోని పదిహేను నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసామని అయన అన్నార. ఓటర్ల నమోదు ప్రక్రియ నామినేషన్ల చివరి తేదీకి పూర్తి చేస్తాం. ఈవీఓం లకు సంబంధించి సిబ్బందికి శిక్షణ పూర్తయింది.రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించి వారి అభ్యంతరాలు స్వీకరించామని అన్నారు. పోలీసు,  జీహెచ్ ఎంసీ సమన్వయంతో సెక్యూరిటీ సెంటర్లు పెట్టాం. వీటిలో ఈవీఎం లను భద్ర పరుస్తాం. ఇరవై మూడు వేల మంది సిబ్బంది అవసరం. రెండువేల మంది తక్కువ ఉన్నారు.. వారిని కూడా సేకరించుకుంటామని అన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులు నామినేషన్లు వేసిన తర్వాత వారి ఖర్చులు పరిగణిస్తాం.  ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక యాప్ లు అందుబాటులోకి తెచ్చాం. ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఎన్జి వోలు,   స్వచ్ఛంద సంస్థల సహాకారం కోరాం. విద్యార్థులచే ఓటింగ్ కు సంభంధించి కర పత్రాల పంపిణీ చేస్తున్నామని అన్నారు. శానిటేషన్ వాహానాలపై పోస్టర్ లు అంటించి ప్రచారం చేపడుతున్నాం. ఎన్నికల పరిశీలకులుగా ఎనిమిది మందిని నియమించామని వెల్లడించారు. జనరల్ అబ్జర్వర్స్ గా మరొ ఎనిమిది మంది ఉంటారు. దివ్యాంగుల కోసం ప్రాత్యేకంగా సదుపాయాలు ఉన్నాయి. వారికి ఓటు వేసేందుకు వాహాన సౌకర్యం ఉందని వివరించారు.   హైదరాబాద్ జిల్లా లో  కొత్త ఓటర్ నమోదుకు 99 ,226 అప్లికేషన్స్ వచ్చాయి.  వాటి పరిశీలన పూర్తీ కావస్తోందని అన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాలు14 నుంచి ప్రారంభమవుతాయి. 3566 పోలింగ్ స్టేషన్ లున్నాయి. ఒక్కో పోలింగ్ బూత్ లో పద్నాలుగు వందల ఓట్లు ఉంటాయి. అదనపు ఓట్లు వచ్చే అవకాశం ఉన్నందున వారికి అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. 

Related Posts