YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇవాళ అభ్యర్ధులకు బీ ఫామ్స్

ఇవాళ అభ్యర్ధులకు బీ ఫామ్స్
తెలంగాణలో ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్‌తో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు తమ అభ్యర్థులకు బి-ఫారాలు అందించనుంది. టీఆర్ఎస్ పార్టీ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా 107 మంది అభ్యర్థులకు బి-ఫారాలను అందించి, మార్గనిర్దేశం చేయనున్నారు. టీఆర్ఎస్ తొలి విడతలో 107 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్‌లో బి-ఫారాలు అందుకునేందుకు అభ్యర్థులను ఆహ్వానించారు. శనివారం మిగతా 12 మంది అభ్యర్థుల పేర్లు ఖరారైతే వారికి కూడా బి-ఫారాలను అందించనున్నారు. 12న మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 19తో ముగుస్తుంది. కేసీఆర్ ఈ నెల 14 లేదా 15న గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. కోనాయిపల్లిలో పూజలు: బి-ఫారాల పంపిణీకి ముందు కేసీఆర్ తన ఇష్టదైవమైన కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా బి-ఫారాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ భవన్‌కు తీసుకొస్తారు. అనంతరం అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తారు.

Related Posts