YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంత్రి ఈటలపై ఆయన డ్రైవర్ పోటీ

మంత్రి ఈటలపై ఆయన డ్రైవర్ పోటీ
తెలంగాణ ఉద్యమసమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో లోక్ సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణపై దాడి చేసిన మంత్రి ఈటల కారు డ్రైవర్ మల్లేష్ తెలంగాణ ఆర్థిక పౌరసరఫరాల శాఖ ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ ఫై పోటి చేస్తుండటం హాట్ హాట్ టాపిక్ గా మారింది. జేపి ఫై దాడిజరిగిన  సమయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యి ఈటల డ్రైవర్ మల్లేష్ ను అరెస్ట్ చేయించారు. దీంతో కేసు నమోదై రిమాండ్ కు వెళ్లాడు మల్లేష్.. నెలకు పైగా జైల్లో గడిపాడు.తెలంగాణ ఆర్థిక పౌరసరఫరాల శాఖ ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ చిక్కుల్లో పడ్డారు. ఆయన వద్ద గతంలో డ్రైవర్ గా పనిచేసి మానేసిన మల్లేష్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈటల రాజేందర్ మోసగాడని ఆరోపించాడు. ఆయన వద్ద పనిచేసే కాలంలో ఇబ్బందులు పెట్టారన్నారు. సడన్ గా ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసి మల్లేష్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు. దీనివెనుక ఎవరున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. మొన్న హరీష్ రావు ఈరోజు ఈటల రాజేందర్ ను ఇరికించేసి ఇలా ప్రత్యర్థులు టీఆర్ఎస్ మంత్రులను టార్గెట్ చేశారని అర్థమవుతోంది.తాజాగా ఈ ఉదంతాన్ని బేస్ చేసుకొని మల్లేష్ ఆరోపణలు గుప్పించాడు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఈటల వద్దకు వెళితే తనను కారు డ్రైవర్ గా చేర్చుకోలేదని ఆరోపించారు. అనేకమంది తనకు సన్మానాలు సత్కారాలు చేసి దాతలు 30 లక్షలు ఇస్తే వాటన్నింటిని ఈటల రాజేందర్ తీసుకున్నాడని మల్లేష్ ఆరోపించాడు. తనకు వచ్చిన 30 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగితే తనవల్లనే నీకు వచ్చాయని నీకెలా ఇస్తానని ఈటల మోసం చేశాడని మల్లేష్ వాపోయాడు.
 ఏ పనిలేక ప్రస్తుతం స్వగ్రామంలో కూలి పనిచేసుకుంటున్నానని.. ఈటల మోసం చేయడంతోనే తాను ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్నానని వాపోయాడు. అందుకే ఈటెల రాజేందర్ మోసాలను ఎండగట్టేందుకు ఆయనపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నట్టు స్పష్టం చేశారు. తాను గెలవకున్నా ఈటల అసలు స్వరూపం జనం ముందు ఉంచుతానని అన్నారు. 

Related Posts