YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నాలుగు రోజుల పాటు మద్యం షాపులు బంద్ ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు ఇక్కట్లు

నాలుగు రోజుల పాటు మద్యం షాపులు బంద్  ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు ఇక్కట్లు
డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం నుంచి 7వ తేదీ సాయంత్రం వరకు షాపులు బంద్. ఓట్ల లెక్కింపు జరిగే 11వ తేదీన కూడా మూతపడనున్న షాపులు.ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు ఇక్కట్లు తప్పేలా లేవు. ఎన్నికలు జరిగే డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 7న ఎన్నికలు జరగనుండగా... 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూత పడనున్నాయి. అదే విధంగా 11వ తేదీన కూడా షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. 

Related Posts