YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణా ఎన్నికలకు నోటిఫికేన్ జారీ

తెలంగాణా ఎన్నికలకు నోటిఫికేన్ జారీ
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం  విడుదల చేసింది. దీంతో సోమవారం  నుంచి ఈ నెల 19 వరకు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగనుంది. కాగా డిసెంబర్ 7 తేదీన ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ 11 వ తేదీన ఫలితాలను ప్రకటించనున్న విషయం తెలిసిందే.  
తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ఇవాళ్టి నుంచి అధికారికంగా మొదలైంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఈరోజు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ నెల 19 వరకు అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఇక ఈ నెల 20న స్క్రూటినీ, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్ గడువు విధించింది. వచ్చే నెల 7న తెలంగాణలోని 119 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. డిసెంబర్ 11 న ఫలితాలు వెల్లడించనున్నారు. దీనికోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మరోవైపు ఇవాళ్టి నుంచి నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం కానుండడంతో, అభ్యర్థుల ఖర్చులపైనా ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర సర్వీస్ ల నుంచి మొత్తం 131 మంది అధికారులు ఇవాళ రాష్ట్రానికి వచ్చారు. వీళ్లలో ఐటీ విభాగానికి సంబంధించి 53 మంది ఐఆర్ఎస్ లు, సాధారణ పరిశీలకులుగా 68 మంది ఐఏఎస్ లు, శాంతి భద్రతల పర్యవేక్షణకు 10 మంది ఐపీఎస్  అధికారులు రాష్ట్రానికి వచ్చారు. గత సెప్టెంబర్ 6 న అసెంబ్లీ రద్దైన నాటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల అధికారులు ఒకటికి రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. అన్ని విధాలుగా సంతృప్తి చెందాకే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ నుంచి పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది.  ఇక ఎన్నికల నిర్వహణకోసం ఇప్పటికే  కేంద్ర బలగాలు రాష్ట్రానికి  చేరుకున్నాయి. ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ లో ఎన్నికలు పూర్తైన తరువాత మరికొన్ని బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్రంలో 13 నియోజకవర్గాలు సమస్యాత్మక ప్రాంతాలుగా ఉండొచ్చని అంచనా వేసిన ఈసీ అక్కడ అదనపు భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆ ప్రాంతాల్లో పోలింగ్ సమయాలను కూడా ఉ. 7 గం. ల నుంచి సా. 4 గం. లుగా నిర్ణయించింది. మిగిలిన చోట్ల సా. 5 గం. ల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు ప్రవాహం అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు, కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పోలీస్ బలగాలను మోహరించింది. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆయా రాష్ట్రాలతో కలిసి నిఘా కట్టుదిట్టం చేసారు. మొబైల్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దింపారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 65 కోట్ల నగదు, 5 కోట్ల విలువైన మధ్యం స్వాదీనం చేసుకున్నారు. ఇవాళ నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్దులు, పార్టీల నేతలపై నిఘాను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు ఎన్నికల అధికారులు. 
ఇక పోలింగ్ రోజు పోలింగ్ బూత్ ల దగ్గర ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది ఎన్నికల కమిషన్. రాష్ట్రంలో 32 వేలకు పైగా పోలింగ్ బూత్ లు ఉన్న నేపథ్యంలో ఆయా చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహిళా ఓటర్ల కోసం నియోజక వర్గానికి 120 పింక్ పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయనుంది. ఇక వికలాంగుల ఓటింగ్ పర్సెంటేజ్ ను పెంచేందుకు ఈసారి ఈసీ ఆధునిక ఏర్పాట్లు చేపట్టింది. వీరిని పోలింగ్ బూత్ లకు తీసుకు వచ్చేందుకు ఉచిత రవాణా సదుపాయంతో పాటు, లోపలికి వెళ్ళేందుకు వీలుగా ర్యాంపుల నిర్మాణం చేపట్టారు. బూత్ ల దగ్గర వీల్ చైర్లను అందుబాటులో ఉంచనున్నారు. అటు ఈవీఎంలలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్న అధికారులు రాష్ట్రంలో 35% అదనపు ఈవీఎంలను సిద్ధంగా ఉంచారు. బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడినా లేదా ఈవీఎంలను ఎత్తుకెళ్ళేందుకు ప్రయత్నించినా ఆ ఈవీఎంలు పనిచేయకుండా లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ను వినియోగించనున్నారు.

Related Posts