YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెరాస రెబల్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్

తెరాస రెబల్ అభ్యర్థి  శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
తెలంగాణా రాష్ట్రం లో నామినేషన్ల పర్వం మొదలు అయ్యింది.. నామినేషన్ వేసేందుకు  ఉప్పల్ నియోజకవర్గం సిద్ధం అయ్యింది.. తెలంగాణా రాష్ట్ర సమితి నుండి టికెట్ ఆశించి నిరాశ పడ్డ నందికొండ శ్రీనివాస్ రెడ్డి రెబల్ అభ్యర్థి గా నామినేషన్ వేయడానికి సోమవారం నాడు హబ్సిగూడ నుండి భారీ ర్యాలీ  నిర్వహించారు..  దీంతో తెలంగాణా రాష్ట్రం లోనే ఇది తొలి నామినేషన్ గా నమోదు కానుంది. తెలంగాణ ఉ్యమకారులను కాదని కొత్త వారికి ఇవ్వడం కరెక్ట్ కాదని నందికొండ శ్రీనివాస్ రెడ్డి వాపోయారు. ఉద్యమంలో పాల్గొని వయసు తో పాటు, డబ్బు పోయిందని ఇంత చేసినా ఇప్పటికైనా తనకు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు.   ఉప్పల్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి గా బెతి సుభాష్ రెడ్డి  దొడ్డి దారిన టికెట్ తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు.

Related Posts