YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కూటమి లోని వ్యతిరేకత అధికారంలోకి తీసుకుని వస్తుంది: కేసీఆర్ ధీమా

 కూటమి లోని వ్యతిరేకత అధికారంలోకి తీసుకుని వస్తుంది: కేసీఆర్ ధీమా
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ మాటల వెనుక ఉన్న ధీమ ఆదివారం నాడు నిర్వహించిన అభ్యర్దుల సమావేశంలో మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు ఏర్పటైన మహాకూటమి పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని - ఆ పార్టీలపై ప్రజలకు నమ్మకం లేదని తాజాగా చేయించిన సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. ఈ సమాచారంతోనే కేసీఆర్ తన పార్టీ విజయం పట్ల ధీమగా ఉన్నారని అంటున్నారు. మహాకూటమి ఏర్పడడానికి ముందు పరిస్దితులు తెరాసాకు అనుకూలంగా లేవని కొన్ని వర్గాలలో ఆ పార్టీపట్ల అసంత్రుప్తి నెలకొందన్న సమాచారం ఉంది. అయితే మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడి పాత్ర ఎక్కువవడంతో తెలంగాణ ప్రజలలో కూటమి పట్ల వ్యతిరేకత ప్రారంభం అయ్యిందని చెబుతున్నారు. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తెలంగాణపై చూపించిన వివక్షను ప్రజలు మరిచిపోలేదని - ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని సమాచారం. వీటికి తోడు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అభివ్రద్ది జరగకపోగా ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు సహేతుకంగా వ్యవహరించలేదని - ఇక్కడి సీమాంధ్రులలో అభిప్రాయం ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ అభివృద్ది చెందుతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్ది చెందటం లేదనే అభిప్రాయం అటు సీమాంధ్రలలోను ఇటు తెలంగాణలోను కూడా ఉంది. ఈ అంశాలపై కేసీఆర్ వద్ద పూర్తి సమాచారం ఉండటంతో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు ఖాయమనే ధీమాలో ఆయన ఉన్నారని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దుల పట్ల వ్యతిరేకత ఉన్న అది నామమాత్రమేనని - గడచిన నాలుగేళ్లలో జరిగిన అభివ్రద్దే పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తుందని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆదివారంనాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దుల సమావేశంలో కేసీఆర్ చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇక మహాకూటమి తన అభ్యర్దులను ప్రకటించిన తర్వాత మరింత సానుకూలమైన వాతవరణం వస్తుందని కూడా కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం నల్లేరు మీద నడకలాంటిదే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related Posts