YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ముషీరాబాద్ లో గెలిస్తే ఇంటికి పాలు, నీళ్లు, నెట్

 ముషీరాబాద్ లో గెలిస్తే ఇంటికి పాలు, నీళ్లు, నెట్
ఆ అభ్యర్థిని గెలిపిస్తే అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు, అబ్బాయిలకు ట్యాబ్లు ఇస్తారట. అంతే కాదండోయ్, ఇంటింటికి పాలు, నీళ్లు కూడా ఉచితంగా ఇస్తారట. ఇదేదో తమిళనాడులో ఎన్నికల అభ్యర్థులు చేస్తున్న హామీలు అనుకుంటే పొరపాటే. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఇలాంటి హామీలతో ఆకట్టుకుంటున్నారు. చిన్న పార్టీల నుంచి లేదా స్వతంత్రులుగా పోటీచేసే అభ్యర్థులు పెద్ద పార్టీలను ఢీకొట్టాలంటే మాటలు కాదు. అందుకే, ఇలాంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే ఇంటింటికి పాల ప్యాకెట్లు పంపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, 20 లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లు కూడా ఉచితంగా పంపిణీ చేస్తానని చెబుతున్నారు. 3 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తానని మాట ఇస్తున్నారు. స్కూటీలు, ట్యాబ్ల హామీ కూడా ఈయన ఇచ్చిన హామీయే. ఆ ట్యాబ్లకు నెట్ కనెక్షన్ కూడా ఆయన ఉచితంగా కల్పిస్తారట. 

Related Posts