YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రెబల్స్ చూపు...ఏనుగు వైపు

రెబల్స్ చూపు...ఏనుగు వైపు
ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ ఉనికి  కాపాడు కునేందుకు ఆయా పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమి స్తున్నారు. కూటమిలో సీటు దొరికితే గెలుపు సులభమని భావించిన నేతలు పొత్తుల సర్దుబాటులో చిత్తయ్యారు. టికెట్టు వచ్చే అవకాశం లేకపోవడంతో అనుచరుల నుంచి ఇబ్బందులు ఎదురైతాయని భావిస్తూ  చిన్న చితక పార్టీల నుంచి బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీ మిత్రులు ఏర్పడి సీట్ల పంపకాలకు చేసుకుంటున్నారు. అందులో కాంగ్రెస్ 93, టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐ 5 సీట్లు పోటీ చేస్తున్నట్లు కూటమి పెద్దలు పేర్కొంటున్నారు. అయితే పార్టీల నుంచి ఆశావహులు చాలామందే ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన నాయకులు పొత్తులో సీటు వెళ్లుతునందున్న స్వతంత్రులుగా బరిలోకి దిగితే  విజయం సాధించలేమని ఆలోచిస్తూ జాతీయ పార్టీల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వారి అనుచరులు వెల్లడిస్తున్నారు. గత మూడు పర్యాయాలు ఎన్నికల్లో  కొంతమంది నాయకులు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీల నుంచి టికెట్లు తీసుకుని బరిలో నిలిచి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో గద్వాల నుంచి డి.కే.అరుణ ఎస్పీ నుంచి పోటీ చేసి  భారీ మెజార్టీతో గెలు పొందారు. 2014 ఎన్నికల్లో బహుజన సమాజ్‌వాదీ పార్టీ తరుపున ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఇంద్ర కరణ్‌రెడ్డి, సిర్పూర్ నుంచి కొనేరు కొనప్ప పోటీ చేసి విజయ పతకం ఎగుర వేశారు. తుంగుతుర్తి, నకిరేకల్, చెన్నూరు. అచ్చంపేట, మానకొండూరు నియోజకవర్గాల్లో 5వేల నుంచి 8వేల వరకు అభ్యర్థులు ఓట్లు సాధించి ప్రముఖ పార్టీ నేతలకు చుక్కలు చూపించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న కూటమిలో సీట్లు దక్కవని భావించిన నాయకులు బీఎస్పీ నుంచి ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై పోటీ చేసి సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నారు. కూటమిలో కాంగ్రెస్ మిత్రులకు 24సీట్లు ఇస్తుండ టంతో అక్కడ ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన నాయ కులు హైకమాండ్‌ను దిక్కరించి బీఎస్పీ నుంచి ప్రచారంలో ఉంటామని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. మల్కాజిగిరి, వరంగల్ వెస్ట్, నకిరేకల్, స్టేషన్ ఘన్‌పూర్, మంచిర్యాల,వైరా, ఆశ్వారావుపేట, హుజూర్‌నగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, ఇబ్ర హింపట్నం  నుంచి ఆశావాహులు పోటీకి సిద్ధమైతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నియోజకవర్గాల్లో పొత్తులో టికెట్ వరించిన నాయకులు  వ్యతిరేక నాయకుడు కావడం, ఆతడు గెలిస్తే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని సమాలోచనలు చేస్తూ ఖచ్చితంగా బరిలో ఉంటామని వ్యాఖ్యానిస్తున్నారు. నామినేషన్ల గడువు దగ్గర పడుతుండటంతో కూటమి పెద్దలు సీట్ల ప్రకటన చేయకుండా నాన్చుడు ధోరణి వ్యవరిస్తూ తీరా గడువువరకు వేచిచూపించి, మరోపార్టీలోకి వెళ్లకుండా కుట్రలు చేస్తున్నట్లు వరంగల్‌కు చెందిన నాయకుడు మండిపడుతున్నారు. వీరి ఎత్తులకు అసలుకే మోసం తప్పదని విరుచుకపడుతున్నారు. మరోపార్టీ ఎస్పీ కూడ  ఇప్పటికే 50మంది అభ్యర్థ్దులను బరిలో నిలిపింది. 119 నియోజకవర్గాలో పోటీ చేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడుతామని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. మరో పార్టీ ఆమ్ ఆద్మీకూడా 30మంది అభ్యర్థ్దులను ప్రకటించింది. రెబెల్స్ బుజ్జగించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ తరుపున ఏఐసీసీ దూతలు రంగంలోకి దిగారు. అదే విధంగా టీజేఎస్, టీడీపీ, సీిపీఐ నాయకులు కూడా అధికారం చేపట్టిన తరువాత తగిన న్యాయం చేస్తామని హామీలిస్తున్నారు. అయిన కొంత మంది తిరుగుబాట్లు ససేమిరా అంటూ ప్రజలకు సేవచే స్తామని కుండబద్దలు కొడుతున్నారు. ఈ తిరుగుబాట్ల దెబ్బ ఎవరిమీద పడుతుందో బరిలో నిలిచే నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts