YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యువత విజ్ఞానాన్ని పెంపొందించుకోవా లి

యువత విజ్ఞానాన్ని పెంపొందించుకోవా లి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలరో సుమారు 55 వేల మంది నిరుద్యోగ యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పొందగలిగారని ఎపి ఫిలిం, టివి అభివృద్ది సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ చెప్పారు. 51వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక జిల్లా కేంద్ర గ్రంధాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు, నిరుద్యోగ యువత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వివిద రంగాలలో ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన పరిజ్ఞానం కోసం పుస్తకాలను ఆశ్రయించాలన్నారు. ముఖ్యమంత్రి అపార అనుభవం, చొరవ వల్ల రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెండుగా వున్నాయన్నారు. సినీ రంగాన్ని అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలవల్ల ఇప్పటికే 15 సినిమాలు ఆంధ్ర ప్రదేశ్ లో తయారవుతున్నాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 వేల మందికి ఉపాధి లభిస్తోందని అంబికా కృష్ట చెప్పారు. కార్ల పరిశ్రమకూడా అనంతపురంలో రాబోతోందని వచ్చే డిసెంబర్ లో ప్రారంభోత్సవం అయ్యే అవకాశం ఉందన్నారు. ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అవసరమైన విజ్ఞానం యువత పెంపొందించుకోవాలన్నారు. ఉన్నతస్థితికి చేరిన అనేక మంది గొప్పగొప్ప వ్యక్తుల జీవితగాధలు తెలుసుకోవడం ద్వారా విద్యార్థుల్లో సమాజంపట్ల అవగాహన పెంపొందుతుందన్నారు. అందుకోసం ప్రతిఒక్కరూ గ్రంధాలయాలను ఉపయోగించుకోవాలన్నారు. గ్రంధాలయాలలో బయట దొరకని అనేక రకాల పుస్తకాలు అందుబాటులో వుంటాయని అంబికా కృష్ట చెప్పారు. ఎంఎల్‌సి రాము సూర్యారావు మాట్లాడుతూ దేవాలయాలకంటే గ్రంధాలయాలు గొప్పవని అన్నారు. గ్రంధాలయాలు ఉపయోగించుకోవడం ద్వారా ఎంతో మంది తమ జీవితాలనుగొప్పగా మలుచుకున్నారన్నారు. విజåానం వల్ల అందరినీ సామాజిక సేవ అలవడుతుందని చెప్పారు. దనికులు, పేదలు అనే బేదం లేకుండా అందరికీ విజ్ఞానం అవసరమని ఏప్రాంతం అభివృద్ది చెందాలన్నా ప్రజలు విజ్ఞానవంతులు కావాలని పేర్కొన్నారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్ మాట్లాడుతూ గ్రంధాలయాలు లేని ఊరు ఉండద ని, విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు కనీసం ఒక గంటఅయినా పుస్తక పఠనం చేయాలన్నారు. సమయం వృధాచేసుకోకుండా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. జాతీయ గ్రంధాలయ వారోత్సవాల సందర్బంగా ఈరోజు నుండి ఈనెల 20వ తేది వరకు వివిధ అంశాలలో నిర్వహించనున్న వక్త్రత్వ, మహిళాభ్యుదయ గీతాలు,వ్యాసరచన వంటి పోటీలలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనాలని కోరారు. సమాచారశాఖ సహాయ సంచాలకులు కె .సుభాషిణి మాట్లాడుతూ మన దేశం ఆద్యాత్మిక దేశమని అందరికీ శాంతి, విజ్ఞానం అవసరమని చెప్పారు. శాంతి ద్వారా ఏపనిఅయినా సాంధించుకోవడంతోపాటు సమన్వయం ఏర్పడుతుందని చెప్పారు. విజ్ఞానం ద్వారా అందరిలో సమన్వయం ఏర్పడి ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందన్నారు. అందుకే ప్రతిఒక్కరూ గ్రంధాలయాలను ఉపయోగించుకుని పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానం పొందాలని కోరారు. డా .బిఆర్ అంబేద్కర్ గ్రంధాలయం మూసే సమయం కూడా తెలియని విధంగా గ్రంధాలయంలో పుస్తకాలు చదివేవారని ఎంతో విజ్ఞానం సంపాదించారుకాబట్టే రాజ్యాంగం కూడా రచించి మహాగొప్ప వ్యక్తి కాగలిగారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ విప్ గూడవల్లి శ్రీనివాస్, వయోజన విద్య ఉపసంచాలకులు వైవిఎస్ సూర్యనారాయణ, రిటైర్ద్ అసోసియేట్ ప్రొఫెసర్, సర్ సిఆర్ఆర్ పిజి కాలేజీ ఎల్ వెంకటేశ్వరరావు, తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంధాలయ సంస్థ కార్య దర్శి శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

Related Posts