YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కుటుంబపాలన నుంచి తెలంగాణ విముక్తి

 కుటుంబపాలన నుంచి  తెలంగాణ విముక్తి
కుటుంబ పాలన నుంచి తెలంగాణను విడిపించ వలసిన బాధ్యత మనందరిపై ఉన్నదని పరిపూర్ణానంద స్వామి అన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రామ రాజ్యం వస్తుందని కారు గుర్తుకు ఓటు వేస్తే కష్టాలు తప్పవన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో పరిపూర్ణానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దుబ్బాక నియోజకవర్గం చరిత్రను మార్చాలంటే రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు భారతీయ జనతాపార్టీ సర్వేలో దుబ్బాక నియోజకవర్గం లో కాషాయం జెండా ఎగురవేస్తాం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే గా రఘునందన్ రావును గెలిపిస్తే రైతులు ,చేనేత, కార్మికుల,బీడీ కార్మికుల బతుకులు మారుతాయన్నారు డిసెంబర్ 11వ తేదీ నాడు దుబ్బాక లో రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ విజయోత్సవ ర్యాలీనీ నిర్వహిస్తున్నారు అంతకుముందు దుబ్బాక పట్టణ కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో దాదాపుగా పది వేల మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు బతుకమ్మ ,బోనాలు, డప్పు చెప్పులతో దుబ్బాక పట్టణము మారుమోగింది. దుబ్బాక రామసముద్రం చెరువు కట్ట నుండి మొదలైన ర్యాలీ దుబ్బాక లోని గాంధీ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుర్యాలీ నిర్వహించారు దుబ్బాక నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ లో పాల్గొన్నారు .
దుబ్బాక ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అభివృద్ధి అంటే రామసముద్రం చెరువుకట్టపై ప్రజలు వాకింగ్ చేయడం కాదన్నారు .తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎంత మంది కి ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రారంభించిన ఏడాదిలోపే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించుకున్నా దుబ్బాక ఎమ్మెల్యే  సోలిపేట రామలింగారెడ్డి కి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మీద సోయి లేదన్నారు. చేనేత కార్మికుల బతుకులు మారుస్తామని కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన నాయకులు దుబ్బాక చేనేత కార్మికుల ను ఎందుకు పాటించుకోలేదన్నారు.ఏం పాపం సిరిసిల్ల చేనేత కార్మికులకు ఒక  న్యాయం దుబ్బాక చేనేత కార్మికుల కు ఒక న్యాయమా అన్నారు.దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిపిస్తే తన శేష జీవితాన్ని పూర్తిగా దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తానని స్వామి పరిపూర్ణానంద సాక్షిగా మాధవ నేని రఘునందన్ రావు ప్రమాణం చేశారు.

Related Posts