YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దేవేందర్ గౌడ్ ఆస్తులపై ఐటీ రైడ్స్

దేవేందర్ గౌడ్ ఆస్తులపై ఐటీ రైడ్స్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌ గౌడ్‌కు చెందిన సంస్థలపై ఐటీ శాఖ మరోసారి దృష్టి సారించింది. ఇటీవల ఉత్తరాంధ్రలో ఆయనకు సంబంధించిన సంస్థల్లో ఇప్పటికే సోదాలు చేసిన ఐటీ అధికారులు.. దేవేందర్‌గౌడ్ కుమారులు ప్రమోటర్స్‌గా ఉన్న సంస్థల్లో  మరోసారి తనఖీలు చేపట్టారు. ముఖ్యంగా హైద్రాబాద్‌లోని రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రియల్ ఎస్టేట్ సంస్థ డీఎస్‌ఏ బిల్డర్స్ & కన్‌స్ట్రక్షన్స్, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలపై సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో మొత్తం 20 బృందాలు పాల్గొంటున్నాయి. వి ఫుడ్స్‌లో దేవేందర్‌గౌడ్ ముగ్గురు కుమారులు ప్రమోటర్స్‌గా ఉన్నారు. రవి ఫుడ్స్ ప్రమోటర్స్‌గా ఉన్నవారే డీఎస్ఏ బిల్డర్స్ సంస్థకు కూడా ప్రమోటర్లుగా ఉన్నారు. రవి ఫుడ్స్ డైరెక్టర్లు రవీందర్ కుమార్ అగర్వాల్, రాజేంద్రకుమార్ అగర్వాల్, కేదర్నాథ్ అగర్వాల్ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. శాంతాశ్రీరామ్ ఎండీ మడ్డి నర్సయ్య ఇంట్లో కూడ సోదాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. 1500 కోట్ల టర్నోవర్ ఉన్న రవిఫుడ్స్ దేవేందర్ గౌడ్ తనయులు తప్పుకున్నారని సమాచారం.దేవేందర్‌గౌడ్‌ కుమారుడు వీరేందర్‌గౌడ్‌ ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అభ్యర్థిత్వానికి సంబంధించి బుధవారం ఆయన నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తెదేపా శ్రేణులు కూడా ఐటీ తనిఖీలపై మండిపడుతున్నాయి. అయితే తమపై ఎలాంటి దాడులు జరిగినా భయపడేది లేదని వీరేందర్‌గౌడ్‌ స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో తూళ్ల వీరేందర్ గౌడ్ చేవేళ్ల నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ సమయంలో రూ.58 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వీరేందర్ గౌడ్, ఏడాదికి కేవలం రూ.720ల పన్ను చెల్లించే ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Related Posts