YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బాబు కోసం..మాజీ టీడీపీలు ఎదురు చూపులు

 బాబు కోసం..మాజీ టీడీపీలు ఎదురు చూపులు
తెలంగాణ ఎన్నికల యుద్ధంలో టిడిపి అధినేత చంద్రబాబు పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. ఎటువైపు చూసినా…తన వాళ్లే కనిపిస్తున్నారట. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌,బిజెపి, జనసమితిల్లోని చాలా మంది నాయకులు..ఆయన శిష్యులే ఆయన వద్ద పనిచేసిన వారే. వారిలో కొందరిని దగ్గరుండి, సొమ్ములిచ్చి…అండగా ఉండి గెలిపించిన వారే. టిడిపి నుంచి గెలిచి పార్టీ ఫిరాయించి..టిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో దాదాపు 12మంది నిన్న మొన్నటి వరకు తన శిష్యులే. ఇప్పుడు వారంతా..తన ప్రత్యర్థులే. ముఖ్యంగా జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న వీరు..తమకు ‘బాబు’ సాయం చేయకపోయినా..తమ గురించి విమర్శించకుండా ఉంటే బాగుండన్న భావన ఉందట. వారు అలా ఉంటే…కాంగ్రెస్‌లో టిక్కెట్‌ తెచ్చుకున్నవారిలో చాలా మంది తన సహచరులు,మిత్రులు,సన్నిహితులే ఉన్నారట.2018  కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్‌లో ఎక్కువ మంది.. ‘చంద్రబాబు’ మనుషులే ఉన్నారని… టిఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఇది కాంగ్రెస్‌ జాబితా కాదు..చంద్రబాబు శిష్యుల జాబితా.. అంటూ మెటికలువిరిస్తున్నారట. వీరిలో కొందరు ఆయనను చేతులు పట్టుకుని బతిమాలాడుతున్నారట. ఒక్కసారి..తమను చూసుకోవాలని కోరుతున్నారు. వీరిలో ‘చంద్రబాబు’ కు అతి సన్నిహితులైన వారు కూడా ఉన్నారు. నిన్న మొన్నటి దాకా..తన వద్దే ఉండి…ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన ‘రేవంత్‌రెడ్డి, సీతక్క,వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, రమేష్‌రాథోడ్‌, కె.ఎస్‌.రత్నం తదితరులు కాగా…పాత తరం నాయకులు ‘జానారెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి వంటి నేతలు కూడా ఉన్నారు. వీరంతా.. నిన్న మొన్నటి దాకా..తన దగ్గర ఉన్నవాళ్లే..ఇప్పుడు ప్రత్యర్థులు.. మరోవైపు..తనకు పాత అనుచరులే.. తమకు సాయం చేయాలని..రాయబారాలు..చేస్తున్నారు. తన దగ్గర పనిచేసి..తన మెప్పుపొంది.. తనను ప్రశంసించిన వారిపైనే అస్త్రాలను ఎక్కుపెట్టాల్సిన పరిస్థితి ఒకవైపు ఉండగా..మరో వైపు..పాత సన్నిహితులు, మిత్రులు..ఆదుకోవాలని.. కోరుకుంటు న్నారు. కొందరు కనీసం మాట సహాయమైనా చేయాలని కొందరు, మరి కొందరు ప్రత్యక్షంగా తమ గెలుపు కోసం రావాలని పట్టుపడుతున్నారు.పార్టీలో ఉండి..తనతో విభేదించి..కాంగ్రెస్‌లో చేరిన వారిలో ముఖ్యడైన ‘నాగం జనా ర్థన్‌రెడ్డి’ ఇప్పుడు ‘బాబు’ ఆశీస్సుల కోసం తపిస్తున్నారట. ఆయన తన నియోజకవర్గంలో ఒక్కసారి పర్యటిస్తే..తాను సులు వుగా గట్టెక్కుతానని.. అంటు న్నారట. అప్పట్లో.. టిడిపిలో ‘చంద్రబాబు’ తరువాత… రెండో స్థానంలో ఉన్న ‘నాగం’ అనుకోని పరిస్థితుల్లో టిడిపిని వదలాల్సి వచ్చింది. 2004 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయినా ’నాగం’ గెలిచారు మళ్లీ పట్టుదలతో.. పోరాడారు..2009లో ఓడిపోవడం, రాష్ట్రంలో వేర్పాటు ఉద్యమం..భారీ ఎత్తున జరగడంతో…విధిలేని పరిస్థితుల్లో టిడిపిని వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ‘నాగం’కు వచ్చింది. ‘నాగం’ టిడిపిని వదిలి వెళ్లినా..ఆయన ఎక్కడా అధినేతను దూషించలేదు..తెలంగాణ కోసం కొట్లాడినా తన పరిధిల్లోనే వ్యవహరించారు…టిడిపి కోసం ఉస్మానియాలో దెబ్బలు తిన్నా’గాలి జనార్ధన్‌రెడ్డి’తో తిట్లు తిన్నా..ఆయన పార్టీ కోసమే పనిచేశారు. అటువంటి ‘నాగం’ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉన్నాడు. కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్‌ దక్కించుకున్న ఆర్థిక కష్టాలు వెంటాతుండగా..ఇటీవలే కుమారుడు మృతితో ఆయన తీవ్ర స్థాయిలో ఇబ్బందుల్లోకి కూరుకుపోయారు. ఈ పరిస్థితుల్లో బాబు’ ఎన్నికల సమయంలో..తన నియోజకవర్గంలో పర్యటించి..తనకు చేయిందిస్తే బాగుండని..’నాగం’ కోరుకుంటున్నారట. ఆంధ్రాను ఆనుకుని ఉండే జిల్లా అయిన మహబూబ్‌ నగర్‌లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు..ఆ జిల్లాను ‘చంద్రబాబు’ దత్తత తీసుకుని మరీ అభివృద్ధి చేశాడు..ఆ గుర్తులను మట్టి మనుషులు అప్పుడే మరిచిపోరు. ఈ నేపథ్యంలో…’బాబు’ వస్తే బాగుండని..’నాగం’ అంటున్నారట. మరి ప్రియశిష్యుడి కోసం..’బాబు’ ఆ పనిచేస్తారా.. అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

Related Posts