YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖైరతాబాద్ లో దానం కు చుక్కలు

ఖైరతాబాద్ లో దానం కు చుక్కలు
 హైదరాబాద్‌ నగర రాజకీయాల్లో తనకు మించిన వాడు లేడని విర్రవీగిన ‘దానం’కు గత ఎన్నికల్లో ‘ఖైరతాబాద్‌’ ఓటర్లు చుక్కలు చూపించారు. మొదట్లో సమైక్యవాదిగా ఉన్న..దానం గత ఎన్నికల సమయంలో తెలంగాణకు జైకొట్టారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమసమయంలో…ఆయన అప్పటి విజయవాడ ఎంపి ‘లగడపాటి రాజగోపాల్‌’కు సహాయం చేశారనే పేరుంది. అటువంటి ఆయనకు ఎన్నికల సమయంలో తెలంగాణ ఓటర్లు గుణపాఠం నేర్పారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉండి… బీసీలకు ‘కెసిఆర్‌’ పెద్దపీట వేస్తున్నా డంటూ…టిఆర్‌ఎస్‌లోకి ఉరికిన ‘దానం’కు ‘కెసిఆర్‌’ మొదట్లోనే చుక్కలు చూపించారు. ఖైరతాబాద్‌ టిక్కెట్‌ తనకే ఇస్తారని..మొదటి నుంచి భావించిన ‘దానం’కు ఆఖరి నిమిషం వరకు..టిక్కెట్‌ ఇవ్వకుండా…తన వద్ద ఎలా ఉంటుందో...దానం’కు రుచి చూపిం చారు కెసిఆర్‌. దీంతో లబోదిబో మంటూ..టిఆర్‌ఎస్‌ అధినేత కరుణా కటాక్షాలతో..చివరకు నిన్న టిక్కెట్‌ ఓకే చేయించుకున్న ‘దానం’ను ఒక చూపు చూడాలని..కూటమి నేతలు భావిస్తున్నారు. గతంలో తమ పార్టీలో ఉండి..తమనే ఇబ్బంది పెట్టిన..’దానం’పై కక్ష తీర్చుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తుండగా..పాత లెక్కలు సరిచేసి గుణపాఠం నేర్పాలని టిడిపి చూస్తోంది. దీంతో..ఇప్పుడు ఇక్కడ గెలవడం కోసం… చెమటలు కక్కుతున్నారు…’నాగేందర్‌’. అసలే నగరంలో టిఆర్‌ఎస్‌పట్టు అంతంత మాత్రం…! పైగా ఈ నెలలోనే హైదరాబాద్‌ అభివృద్ధి ప్రధాత ‘చంద్రబాబునాయుడు’ ఏఐసీసీ అధ్యక్షుడు ‘రాహుల్‌గాంధీ’లు రోడ్‌షోలతో హోరెత్తించబోతున్నారుఆది నుంచి వివాదాస్పదమైన నేతగా పేరున్న ఈయన గతంలో టిడిపి నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల సమయంలో తనకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ రాలేదని..టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం టిడిపి ప్రభుత్వంఓడిపోవడంతోనే…కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..ఎన్నికలకు వెళితే ప్రజలు కొర్రుకాల్చి వాతపెట్టారు. అయినా..అప్పటి తన గురువు వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అండతో..రెచ్చిపోయి..దోసుకున్నారనే పేరు తెచ్చుకున్నారు. రదంతా గతం…ఇప్పుడు..మనోడు…మరోసారి..ఖైరతాబాద్‌ నుంచి.. అధికార పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో..ఆయన సంగతి తేల్చాలని..అటు కాంగ్రెస్‌, ఇటు టిడిపి టార్గెట్‌గా పెట్టుకున్నాయి.మధ్యతరగతి, ఐటి ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు, సీమాంధ్రులు..చంద్రబాబుకు ఆకర్షితులు అవుతుండగా ఎస్సీ,ఎస్టీ,వెనుకబడిన తరగతులు వారిని ‘రాహుల్‌’ ఆకర్షిస్తారని..ఈ నేపథ్యంలో…’దానం’ ఓటమి ఖాయమేనని…పరిశీలకులు భావిస్తున్నారు. విచిత్రంగా..సెంటిమెంట్‌ కూడా’దానం’కు వ్యతిరేకంగా ఉంది. ఆయన ఆఖరి నిమిషంలో..ఏ పార్టీ వైపు ఫిరాయిస్తారో..ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడం.. ఖాయమనే సెంటిమెంట్‌ ఉంది. నగర రాజకీయాల్లో ఆయనకు ఐరెన్‌లెగ్‌గా పేరుంది. మరి..ఇప్పుడు..ఈసెంటిమెంట్‌ను దాటి..ఆయన విజయతీరాలకు చేరతారా..? ఏమో చూడాలి మరి.

Related Posts