YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

 కాంగ్రెస్ పార్టీలో చేరికలు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యాదగిరిపల్లి కి చెందిన 70మంది యువకులు శుక్రవారం  కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బీర్ల.ఐ లయ్య సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం వారు  మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఆలేరు నియోజకవర్గానికి అన్ని విధాలుగా అన్యాయం చేశారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం ఉచిత హామీలు అని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ అన్ని కులాలను విస్మరించి కులానికి బర్రె, గొర్రె చెప్తూ కులాలను విభజించి పాలిస్తున్నారన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తనే అభివృద్ధి జరుగుతుందని ఈ రోజు యువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారన్నారు.ఇంకో నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మ్యానిఫెస్టోలో వున్న విధంగా ఇందిరమ్మఇళ్ళు, రైతులుకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తున్నామన్నారు.

Related Posts