YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ప్రాచీన భారతీయ వాస్తు కళకు ప్రతీక  శ్రీకాళహస్తీశ్వరాలయం..

మహా శివరాత్రి పర్వదినానికి శ్రీకాళహస్తి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది  ఈ సందర్భంగా ఈ క్షేత్ర ప్రాశ్యత్యాన్ని ఒక సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  శ్రీకాళహస్తీశ్వరాలయం శ్రీకృష్ణదేవరాయకాలంలో  నిర్మించిన  శ్రీకాళహస్తీశ్వరాలయం  ప్రాచీన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయం నిదర్శనంగా నిలిచింది.  తిరుపతికి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ అమ్మవారు జ్ఞానాంబిక భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటోంది. భక్త కన్నప్ప వృత్తాంతమూ ఈ క్షేత్రానికి సంబంధించిందే. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది.

పెద్ద సంఖ్యలో భక్తులు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలు వారంపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శివరాత్రి ఉత్సవ సమయంలో ఆలయం లోపలే కాకుండా బయట ప్రధాన వీధులైన నెహ్రూ వీధి కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనతో కిటకిటలాడుతుంటాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి శివుడు ఊరేగుతుంటే ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక.

తెప్పలపై స్వామి వారిని
అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని మరియు అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. ఖర్చుపెట్టి పెళ్లి చేసుకోలేని పేదలు .. స్వామి అమ్మవారి కళ్యాణంతో పాటు ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తి ఆలయం అందంగా ముస్తాబైంది. విద్యుద్దీప కాంతులలో శ్రీకాళహస్తీశ్వరుని మూలవిరాట్టు కనిపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు 8 వ తేదీనుంచి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. 20వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. 

నిర్మించబడింది. ప్రాచీన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయం నిదర్శనంగా నిలిచింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారు జ్ఞానాంబిక పూజలందుకుంటోంది. భక్త కన్నప్ప వృత్తాంతమూ ఈ క్షేత్రానికి సంబంధించిందే. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది.

Related Posts